మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కరోనా నియంత్రణ చర్యల గురించి ఇటీవల రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశానని చెప్పారు. కరోనా లాంటి సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించానని అన్నారు. తాను నిన్న ప్రధాని మోదీ కార్యాలయానిక్ ఫోన్ చేశానని... ఆయనతో మాట్లాడాలని అడిగానని తెలిపారు. 
 
ఈరోజు ఉదయం 8.30 గంటలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారని... ఆయనతో నా ఆలోచనలు అన్నీ పంచుకున్నానని చెప్పారు. కానీ ప్రధాని మోదీ బాబుకు కాల్ చేయడం వెనుక ఒక ట్విస్ట్ వస్తుంది. దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని కొన్ని రోజుల క్రితం దేశంలోని సీనియర్ నాయకులకు, ప్రాంతీయ పార్టీల నేతలకు ఫోన్లు చేసి కరోనాను కట్టడి చేయడానికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. 
 
అఖిలేష్ యాదవ్, స్టాలిన్, ములాయం సింగ్ యాదవ్, దేవ గౌడ, ఇతర నాయకులకు కొన్ని రోజుల క్రితమే మోదీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కానీ ఆరోజు చంద్రబాబుకు ఫోన్ కాల్ రాలేదు. ఈరోజు వచ్చిన ఫోన్ కాల్ కూడా ప్రధాని మోదీ స్వయంగా చేసిన ఫోన్ కాల్ కానే కాదు. చంద్రబాబు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడాలని కోరడంతో మోదీ చంద్రబాబుకు కాల్ చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా మీడియాతో చెప్పారు. 
 
అయితే పీఎంవో కార్యాలయం నుంచి చంద్రబాబుకు కాల్ చేసినట్లు ధ్రువీకరణ రాలేదు. గతంలో కొందరు సీనియర్ నాయకులకు మోదీ కాల్ చేసినపుడు పీఎంవో కార్యాలయం అధికారికంగా ప్రకటన చేసింది. ఆ నాయకులు ఎక్కడా మీడియా ముందుకు వచ్చి తమకు కాల్ వచ్చిందని చెప్పుకోలేదు. ఈరోజు పీఎంవో కార్యాలయం నుంచి మీడియాకు ధ్రువీకరణ వస్తుందని చంద్రబాబు భావించారు. కానీ పీఎంవో కార్యాలయం నుంచి ప్రకటన రాకపోవడంతో చంద్రబాబు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మోదీ కాల్ చేసినట్లు వెల్లడించారు . 
 
మోదీ చంద్రబాబు సలహాలు అవసరం లేదనే విధంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు మాత్రం మోదీ ఫోన్ కాల్ గురించి ఎందుకింత ప్రచారం చేసుకుంటారనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. మోదీ చంద్రబాబుపై కోపం వల్లే మోదీ ఫోన్ చేయలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరగడంతో చంద్రబాబు స్వయంగా టీడీపీ కార్యాలయానికి ఫోన్ చేసి మోదీ కాల్ చేసేలా చేసుకున్నారని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: