జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇంకా ఏడాది కూడా కాలేదు. జగన్ తాను ముప్పయ్యేళ్ళు సీఎంగా ఉండాలని కూడా చెప్పుకున్నారు. జగన్ సంక్షేమ పధకాలు చూసుకున్నా, ఆయన ఆలోచనలు చూసుకున్నా జగన్ చాలా మాస్టర్ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నారనుకోవాలి.

 

అటువంటి జగన్ మీద ఒకనాటి ఆయన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న  కడప జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి హాట్ కామెంట్స్  చేశారు. జగన్ కి సీఎం కుర్చీ సరిపోదని, ఆయనకు ప్రధాని కుర్చీ కావాలని అది సంచలమైన ప్రకటన చేశారు.

 

జగన్ ముఖ్యమంత్రిగా చిన్న వయసులో అవడంతో తాను ఎప్పటికైనా ప్రధాని కావాలన్న ఆశతో ఉన్నారని కూడా అసలు గుట్టు అదే తనకు తెలిసిన గుట్టు బయట పెట్టారు. జగన్ ది పూర్తిగా పొలిటికల్  మైండ్ అని కూడా ఆయన విమర్శిచారు.

 

జగన్ కరోనా వైరస్ ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని కూడా విమర్శించారు లాక్ డౌన్ సడలింపు ఇస్తే స్థానిక  ఎన్నికలు పెట్టడానికి జగన్ రెడీ అని ఆది  అంటున్నారు. . జగన్ తాను అనుకున్నదే చేసె మనస్తత్వం అంటూనే జగన్ మొండి వైఖరికి అధికారులు బలి అవుతున్నారని విమర్శించారు. జగన్ కి ఎదురు వచ్చే వారు అంటే అసలు సహించరు అని కూడ చెప్పారు.

 

మొత్తం మీద చూసుకుంటే జగన్ పెద్ద కుర్చీ మీదనే కన్నేశాడని చెప్పడం మాత్రం అది కొత్త విషయాన్ని చెప్పినట్లే అనుకోవాలి. ఏది ఏమైనా కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉండడం ప్రత్యర్ధులు  అందరికీ ఇబ్బందిగా ఉందనే అనుకోవాలేమో.

 

జగన్ మనసులో ఏమి ఉందో ఊహించి చెప్పేస్తున్న ఆదినారాయణరెడ్డి జగన్ విషయంలో అన్నీ నెగిటివ్ విషయాలు ప్రచారం చేయడమే కాకుండా ఎపుడైనా మంచి చెప్పారా అని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ మీద బురద జల్లడానికే ఆది బీజేపీలో చేరారని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: