దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ బయట పడుతున్న తరుణంలో ప్రధాని మోడీ లాక్ డౌన్ మే మూడవ తారీఖు వరకు ఉంటుందని చెప్పిన విషయం మనకందరికీ తెలిసినదే. ఏప్రిల్ 20 వరకూ ఉండే లాక్ డౌన్ లో చాలా కఠినతరంగా ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఈ కరోనా వైరస్ పోరాటం విషయంలో ప్రపంచ దేశాలు అన్ని చేతులెత్తేసి ఉన్న టైంలో భారత్ మాత్రం చాలా గట్టిగా పోరాడుతుందని...ఇది మీ విజయం అంటూ జాతినుద్దేశించి ఉత్తేజ భరితంగా మోడీ మాట్లాడటం జరిగింది.

 

రాబోయే రోజులు చాలా కీలకమని మే 3 వరకు ఇళ్లలోనే ఉండాలని...ఈ యుద్ధంలో మనందరం గెలవాలని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. అంతేకాకుండా కరోనా హాట్ స్పాట్ ల మీద ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వివరించారు. ఇదే టైములో సప్తపది అంటూ కొన్ని సూచనలు ప్రజలకు ఇచ్చి పాటించాలని తెలిపారు. మోడీ మొత్తం ఏడు సూచనలు ఇచ్చారు. ప్రతి సూచనలో ఓ లాజిక్ ఉండేవిధంగా మోడీ చెప్పడం జరిగింది. 

 

కాగా ఈ నేపథ్యంలో మోడీ సప్తపది క్షుణ్ణంగా ఓసారి పరిశీలిద్దాం:-

 

1.సీనియర్ సిటిజన్స్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి.

 

ఈ సూచన మోడీ ఇవ్వడానికి గల కారణం చూస్తే , ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారిలో ఎక్కువగా 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్లే. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో..వైరస్ ని ఎదుర్కొనలేక చాలామంది వృద్ధులు ఈ కరోనా వైరస్ వచ్చాక మరణించడం జరిగింది. దీంతో సీనియర్ సిటిజన్స్ నీ కాపాడుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. 

 

2.మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి. సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలి.

 

ఈ విషయం మోడీనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రధానులు చెబుతున్నారు. ఇదే టైములో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా తెలియజేసింది. మెడిసిన్ మరియు వ్యాక్సిన్ లేని ఈ కరోనా నీ ఎదురు కొనాలంటే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లిన టైములో మాస్క్ లు ధరించాలి అని అంటున్నారు. ఈ వైరస్ కళ్ళు ముక్కు నోరు నుండి గొంతులోకి ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి  వెళ్లకుండా ఉండాలంటే మాస్క్ తప్పనిసరి అని అంటున్నారు.   

 

3.అత్యవసర విధుల్లో ఉన్న వారిని గౌరవించాలి.

 

ప్రాణాలకు తెగించి వైద్యులను మరియు పోలీసు వారికి సహకరించాలని..ప్రస్తుతం ప్రజలంతా సురక్షితంగా ఉండటానికి కారణం వాళ్లే అని అందువల్ల వాటిని గౌరవించాలని ప్రధాని పిలుపు ఇవ్వటం జరిగింది. 

 

4.పేదలకు అండగా ఉండాలి.

 

చాలా వరకు దేశంలో డబ్బున్నవాళ్ళు లాక్ డౌన్ పిరియడ్ వల్ల పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొనడం లేదు. అంతేకాకుండా ఇంటిలోనే ఉంటూ సమృద్ధిగా బతుకుతున్నారు. కానీ లాక్ డౌన్ వల్ల దేశంలో ఎక్కువగా నష్టపోయింది పేదవాడు. ఏ రోజుకి ఆ రోజు అనే విధంగా బతికేవాళ్ళు లాక్ డౌన్ వల్ల అనేక ఆకలిదప్పులు ఎదుర్కొంటున్నారు. దీంతో కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి టైమ్ లో పేద వాళ్ళని ఆదుకోవాలని ప్రధాని మోడీ పిలుపునివ్వడం జరిగింది.


5.రోగ నిరోధక శక్తి పెంపొందించే ఆహారం తీసుకోవాలి.

 

ప్రపంచంలో ఉన్న అన్ని వైరస్ ఎందుకంటే ఈ వైరస్ 10 శాతం డేంజరస్ వైరస్ అని తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మోడీ ప్రస్తుతం మీ ఇంటిలో కాలాన్ని తీసుకునే ఆహారంలో రోగనిరోధక శక్తిని పెంపొందించే విధంగా తీసుకుంటే, రాబోయే రోజుల్లో ఎటు వంటి ప్రమాదకరమైన రోజులైనా ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతో తెలియ చెప్పినట్లు తెలుస్తోంది.

 

6.ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

 

ఈ యాప్ వల్ల అనేక ఆరోగ్యకరమైన విషయాలని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మోడీ చెప్పినట్లు అర్థమవుతుంది. 

 

7.ప్రయివేటు సంస్థలు ఉద్యోగులను విధుల నుంచి తొలగించవద్దు.

 

లాక్ డౌన్ వల్ల ప్రైవేటు రంగం కూడా  చాలా వరకు నష్టపోయింది. అన్నీ మూతపడటంతో ప్రైవేటు సంస్థలు రాబోయే రోజుల్లో తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేక ఇప్పటి నుండే ఉద్యోగస్తులను పీకేస్తున్నారు. దీన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం నుండి ఇచ్చేవిధంగా ముందే సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులను విధుల నుంచి తొలగించవద్దు అని చెప్పినట్లు అర్థం అవుతోంది.  




మరింత సమాచారం తెలుసుకోండి: