లాక్ డౌన్ నేపధ్యం లో వలస కార్మికుల కష్టాలు అన్ని, ఇన్ని కావు . లాక్ డౌన్ కారణంగా పని లేకపోవడం తో , పొట్ట నింపుకునేందుకు కనీసం  నిత్యావసర సరుకులు కూడా అందుబాటు లో  లేకపోవడం తో ,     ప్రతిరోజూ వందలాది మంది సొంత గ్రామాలకు  కాలినడకన పయనమవుతున్నారు . వందల కిమీ నడిచి స్వగ్రామాలను చేరుకునేందుకు  హైదరాబాద్ నగరం నుంచి పలువురు బయల్దేరుతుండడం ... అధికారులు మాత్రం వలస కూలీలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొనడం రివాజుగా మారింది  .

 

ఇతర రాష్ట్రాల నుంచి  వచ్చిన వలస కూలీలను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని కేసీఆర్ సర్కార్ చెబుతున్నప్పటికీ ,  వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కన్పిస్తోంది . ఆంధ్ర ప్రదేశ్ లోని   శ్రీకాకుళం జిల్లా  నుంచి హైదరాబాద్ కు కూలీ పనుల నిమిత్తం వచ్చిన పలువురు కార్మికులు మంగళవారం ఉదయం తమ స్వగ్రామాలకు బయలుదేరగా , వారిని నగర శివారు హబ్సీగూడ ప్రాంతం లో పోలీసులు అడ్డుకున్నారు . లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండాలని , వలస కూలీలకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని   పోలీసు ఉన్నతాధికారులు,  వలస కూలీలకు  వివరించారు . 

 

ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ద్వారా తెలుసుకున్న , మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ , వలస కూలీలకు బియ్యం , నగదు పంపిణీకి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు  . అయితే అదే సమయం లో   చంటి బిడ్డను చంకన పెట్టుకుని కొంతమంది వలస కూలీలు , బీదర్ కు కాలినడకన బయల్దేరిన దృశ్యాలు అందర్నీ కదిలించి వేశాయి . మండే ఎండలో చిన్నారిని చంకన పెట్టుకుని , చేతిలో బరువైన బ్యాగ్ లు పట్టుకుని వలస కూలీలు తమ గమ్య స్థానానికి చేరుకునేందుకు పడరాని పాట్లు పడుతున్న,  వారిని నిలువరించి ఉండేందుకు షల్టర్ కల్పించేందుకు  ప్రభుత్వం  ముందుకు రాకపోవడం విమర్శలకు తావునిస్తోంది .  . 

మరింత సమాచారం తెలుసుకోండి: