లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలు మూతపడ్డ విషయం అందరికీ తెలిసినదే. మందులేని ఈ వైరస్ ని ఎదుర్కొనాలి అంటే కేవలం నియంత్రణ ఒకటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే మొదటి లో 21 రోజులు విధించిన ఈ లాక్ డౌన్ తాజాగా 19 రోజులు పెంచి మే 3 వరకు ఉంటుందని తెలపడం జరిగింది. అయితే లాక్ డౌన్ వల్ల ఎక్కడికక్కడ కార్యకలాపాలన్నీ ఆగిపోవడంతో నిలిచిపోవడంతో 19 రోజులకు గాను ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల వరకు కేంద్ర ఆర్థిక రంగానికి నష్టం వచ్చినట్లు లెక్కలు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు మే 3 వరకు లాక్ డౌన్ ఉండటంతో దాదాపు భారత దేశ ఆర్థిక రంగానికి 20 లక్షల కోట్లు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

 

ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అదేవిధంగా రవాణా మరియు పర్యాటకశాఖ రంగాలలో ఎక్కువగా నష్టాలు వస్తున్నట్లు ఆర్థిక నిపుణులు చెప్పుకొచ్చారు. మిగిలిన రంగాలతో పోలిస్తే రిటైల్ రంగం తక్కువ నష్టాన్ని నమోదు చేసుకుందని అన్నారు. దీంతో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లు ఏ విధంగా భర్తీ చేస్తుంది అన్న సందేహం ఇప్పుడు సామాన్య ప్రజల్లో నెలకొంది. ఒక పక్క కేంద్ర ఆర్థిక శాఖ రాబోయే రోజుల్లో పెట్రోల్ అదేవిధంగా భవిష్యత్తులో టాక్స్ లు పెంచడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే 20 లక్షల కోట్ల భారం ప్రజల పైన పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

అయితే ఈ తరుణంలో ఇప్పటికే పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు లాక్ డౌన్ కారణంగా అనేక అవస్థలు పడుతున్న తరుణంలో వాళ్ళ పైన భారం మోపే విధంగా నిర్ణయాలు ఉంటే మాత్రం వ్యవస్థ పూర్తిగా మారిపోతుందని అంటున్నారు. దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడే రోజులు వస్తాయని...కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయంలో సామాన్యుడిపై భారం పడకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అనే టాక్ వినబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: