భారత్‌లోనూ కరోనా విజృంభిస్తోంది.. రోజురోజుకూ విస్తరిస్తోంది. లాక్ డౌన్‌లకూ లొంగనంటోంది. ఇలాంటి సమయంలో ఓ పెద్ద రాష్ట్రాన్ని డీల్ చేయాలంటే మంత్రి వర్గం చాలా యాక్టివ్ గా ఉండాలి. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, హోం మంత్రి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తుండాలి. అధికారులకు మార్గదర్శకాలు ఇస్తుండాలి. ముఖ్యమంత్రి ఓవరాల్ గా పర్యవేక్షణ చేయాలి.

 

 

కానీ ఆ రాష్ట్రంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అక్కడ మొత్తం వ్యవహారం అంతా ముఖ్యమంత్రి ఒక్కడే చూసుకోవాలి. అదేంటి.. మిగిలిన మంత్రులు ఏమైపోయారు అంటారా.. అసలు కేబినెట్ అంటూ ఒకటి ఉంటే కదా.. అవును ఇదే విచిత్రమైన పరిస్థితి మహారాష్ట్ర సర్కారుది. కరోనా తో సహా అన్ని సమస్యలను ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రమే చూసుకోవల్సి ఉంటుంది.

 

 

ఎందుకంటే.. ఇరవై రోజుల క్రితం మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత శివరాజ్ సింగ్ ఒక్కరే ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించారు. ఇంకా అక్కడ మంత్రి వర్గ విస్తరణ చేయలేదు. ఈ మధ్యలో కరోనా వచ్చేసింది. అసలు ఆయన ప్రమాణ స్వీకారమే అత్యంత నిరాడంబరంగా జరిగింది. ఇక అప్పటి నుంచీ అన్నీ ముఖ్యమంత్రి ఒక్కరే చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో శివరాజ్ సింగ్ చౌహన్‌.. కరోనా కట్టడి కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.

 

 

బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆ టాస్క్ ఫోర్స్ లో ఇద్దరు అధికారులకు పాజిటివ్ వచ్చింది. దీంతో అనుమానంతో మిగిలిన అధికారులంతా క్వారంటైన్ లోకి వెళ్లారు. అటు మంత్రులూ లేక..ఇటు చక్కదిద్దాల్సిన సీనియర్ అధికారులూ లేక ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో మధ్యప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కట్టడి విషయంలో గందరగోళం నెలకొందట. కాకపోతే.. శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అత్యధిక కాలం సీఎంగా ఉన్న అనుభవం కొంతలో కొంత ఊరటనిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: