భారతదేశాన్ని ఎంతగానో కబళిస్తున్న కరోనా  పరిస్థితిని ఎదుర్కోవడానికి దేశమంతా సమన్వయంగా ఒక తాటిపై నిలబడి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు కరోనా మహమ్మారిని  ఎదుర్కోవడానికి ప్రజలను చైతన్య పరుస్తూ అందరూ కరోనా పై  పోరాటానికి సిద్ధం అయ్యేలా చేస్తున్నారు. ఎన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పటికీ కేంద్ర ప్రభుత్వం భారత ప్రజలు ధైర్యంగా కరోనా  పై పోరాటం చేస్తున్నారు. ఎన్ని సవాళ్లు  ఎదురైనా స్వీకరించి .. కరోనా వైరస్  తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కరోనా ను  చాలా మటుకు నియంత్రించాలి  అని చెప్పవచ్చు. 

 

 ఇదిలా ఉంటే... రోజురోజుకు  ప్రజలు కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్న విషయం తెలిసిందే. రోజు ఇంట్లో ఉండటం వల్లనో లేదా రిలాక్సేషన్ లేకపోవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇక్కడొకడు తన  శాడిజాన్ని  ప్రదర్శించి ఏకంగా భారతమాతని  అవమానించాడు. అతని పేరు అరుణ్ నంబియార్ .. 7వ తేదీన సోషల్ మీడియా వేదికగా అతనొక పోస్ట్ చేశారు. జిప్పు  తీసి నిలబడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు భరతమాత మోకాళ్ళ పై ఉంది అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్  పెట్టాడు. అయితే ఈ పోస్ట్ పై పెద్ద ఎత్తున తీవ్రస్థాయిలో భారత ప్రజలు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 విషయం పోలీసుల వరకు వెళ్లగా  పోలీసులు ఈ వ్యక్తి ముంబై లోని  డిజిటల్ రొంబస్  అని కంపెనీలో పనిచేస్తున్నాడు తీసుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆ వ్యక్తి పై వస్తున్న ఆగ్రహావేశాలను చూసిన కంపెనీ యాజమాన్యం అతన్ని  ఉద్యోగం తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దేషాన్ని అవమానించే  కుక్కలకు తమ కంపెనీలో స్థానం లేదు అంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కంపెనీ. అయితే అరుణ్  నంబియార్ అనే వ్యక్తి గతంలో కూడా ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి చిత్ర విచిత్ర సోషల్ మీడియా వేదికగా పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: