విశాఖ ప‌ట్ట‌ణాన్ని త్వ‌ర‌లోనే క‌రోనా ఫ్రీ ప‌ట్ట‌ణంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదుకాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే విశాఖ ప‌ట్ట‌ణంలో గ‌తంలో న‌మోదైన 20 కేసులు మిన‌హా వారం రోజులుగా ఒక్క క‌రోనా కేసులు న‌మోదుకాక‌పోవ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌ల్లో కొంత సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక చికిత్స పొందిన వారిలో ఆరుగురు ఇప్ప‌టికే డిశ్చార్జి అయి హోం క్వారంటైన్లో ఉన్నారు. 

 

ప్ర‌స్తుతం విశాఖ ప‌ట్ట‌ణంలో 16ఆక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. ఇందులో కూడా చాలామంది బెట‌ర్ కండిష‌న్‌లోనే ఉన్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే వారు కూడా చికిత్స పూర్త‌య్యాక ఇంటింకి చేరుతార‌ని వైద్య వ‌ర్గాలు చెబుతున్నాయి. వారిని ఇంటికి పంపించాక‌, కొత్త కేసులు న‌మోదుకాకుంటే విశాఖను క‌రోనా ఫ్రీ ప‌ట్ట‌ణంగా ప్ర‌క‌టించే ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిస్థితి మెరుగవుతోందని వెల్ల‌డించారు. వారం రోజులుగా జిల్లాలో కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఇదే ట్రెండ్ కొనసాగుతుందని.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు కూడా కోలుకుంటారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

ఇదిలా ఉండ‌గా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ  పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 44 మందికి కరోనా పాజిటివ్ న‌మోదుకావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 483కు చేరింది.  ఒక్క‌ గుంటూరు జిల్లాలో 114 కేసులు నమోదై ఉన్నాయి.  ఆ త‌ర్వాత స్థానంలో కర్నూలు జిల్లాలో 91 కేసుల‌తో కొన‌సాగుతోంది.లాక్‌డౌన్  మే3 వ‌ర‌కు ప్ర‌క‌టించ‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌లు కాస్త నిరుత్సాహానికి గుర‌వుతున్నా..క‌రోనా వైర‌స్ ఉధృత‌మ‌వుతున్న వేళ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం నూటికి నూరుపాళ్లు నిజ‌మేనని స‌మ‌ర్థించేవాళ్లు ఉన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ అల‌ర్ట్ అయింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: