చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నిటిని గడగడలాడిస్తున్నది. అగ్రరాజ్యం అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలలో యుద్ధవాతావరణం కంటే అతి భీకరమైన పరిస్థితులు నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదు. భారతదేశంలో కూడా 11 వేల మంది కరోనా వైరస్ బారిన... వారిలో దాదాపు 400 మంది చనిపోయారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ కనిపించని రాకాసి పురుగు కారణంగా చిన్నాభిన్నం అవుతుంది. దేశానికి ఎంత నష్టం వాటిల్లుతున్నప్పటికీ... ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ని మే 3వ తారీఖు వరకు పొడగించారు. నిజానికి మోడీ అనేక సందర్భాలలో లాక్ డౌన్ నిర్ణయం అనేది పెద్దవారి కోసమే తీసుకోబడింది అని తెలిపారు. ఎందుకంటే ఆ 60 సంవత్సరాలు దాటిన వారు కరోనా వైరస్ బారిన పడితే... వారి ప్రాణాలను రక్షించడం ఎవరికైనా అసాధ్యమే. అయితే తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ 60 సంవత్సరాలు దాటినవారు ఎటువంటి సూచనలు పాటించాలో ఓ మార్గదర్శకాల జాబితాలో పేర్కొంది.


ఆ మార్గదర్శకాల ప్రకారం... దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వ్యాధిగ్రస్తులు ఎట్టి పరిస్థితులలో బయటకి రాకూడదు. ఎందుకంటే వృద్ధులకు కరోనా వైరస్ ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు గుండెకు సంబంధించిన రుగ్మతలు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ జబ్బు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఇంకా మధుమేహం హైపర్టెన్షన్ లాంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తమ ఇళ్ల నుండి బయటకు రాక పోవడమే శ్రేయస్కరం. అలాగే ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెసింగు తూచా తప్పకుండా పాటించాలి. వేడి వేడి భోజనాన్ని తినాలి. మీ వంటలలో ఆయుర్వేద ఆహారం ఉండేటట్లు చూసుకోండి. ప్రతి రోజు ఉప్పు వేసిన వేడినీటితో స్నానం చేయాలి. జన సమూహం ఉన్న ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళినా... మాస్కు ధరించి, ఎవరికీ కరచాలనం చేయకుండా ఉండాలి.


హార్ట్ బీట్ ని పెంచే ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ సస్పెన్స్ మూవీస్ చూడకుండా ఉండాలి. బీడీ, సిగరెట్, బ్రాండీ విస్కీ లాంటివి అనారోగ్యాన్ని కలగజేస్తాయి. వీటివల్ల మీలో రోగనిరోధక శక్తి కూడా బలహీన పడుతుంది. అందుకే 60 ఏళ్ల వయసు పైబడిన వారు వీటికి దూరంగా ఉండాలి. దగ్గు జలుబు జ్వరం ఇలాంటి అనారోగ్య సమస్యలు వారాల తరబడి తగ్గకుంటే వెంటనే మీ స్థానిక ఆసుపత్రిలో చూపించుకోవాలి. గోరువెచ్చని నీటిని తరచుగా తాగుతుంటే శరీరంలోని బ్యాడ్ బ్యాక్టీరియా నశిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: