ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ కరోనా మహమ్మారి తరుణంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజలు ఎవరూ కూడా పస్తులతో పడుకోవద్దని తగిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులకు ఆదేశించడం జరిగింది. రేషన్ కార్డ్ లేకపోయినా సరే అర్హులైన వారందరికీ బియ్యం అందచేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించడం జరిగింది. అంతేకాదు వీలుంటే ఐదు రోజుల్లోనే రేషన్ కార్డులు అందజేసే లాగా చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రేషన్ సరుకుల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామని తెలియజేయడం జరిగింది.

 


ఇక ఇప్పటి వరకు రేషన్ తో పాటు వెయ్యి రూపాయల నగదు రాని వారందరికీ త్వరలోనే అందరికీ అంద చేస్తున్నామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా బుధవారం నుంచి రెండో విడత రేషన్ పంపిణీ చేస్తున్నట్లు.. దీనితో పాటు అదనంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇక రాష్ట్రమంతా వాలంటీర్ల ద్వారా రేషన్ దారుల కూపన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇక కూపన్ల మీద ఉన్న సమయాన్ని అనుసరించి ప్రజలు రేషన్ సరుకులు తీసుకోవాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ దారిద్య్రరేఖకు దిగువనున్న వారి అందరికీ తెల్ల రేషన్ కార్డు, ఎక్కువగా ఉన్నవారికి పింక్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 

 


ఏ కార్డు కూడా ప్రజలకు చేరాలంటే కనీసం వారం రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల అనుగుణంగా ఐదు రోజుల్లోనే కార్డు ఇచ్చే లాగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఎవరైనా రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫారంలో వారి డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ ఫాంలు అన్ని మీ సమీపంలో ఉన్న మీసేవ కేంద్రంలో లభిస్తాయని అధికారులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మీ సేవ అధికార వెబ్ సైట్ లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. దరఖాస్తు పూర్తి చేశాక అవసరమయ్యే డాక్యుమెంట్లో ఆధార్ ఓటర్ కార్డ్ ఇండియా అడ్రస్ వంటివి జిరాక్స్ కాపీలు జత చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు అన్ని మీసేవ సెంటర్లో అందజేసి ఫీజులు కట్టవలసి ఉంటుంది. దరఖాస్తులు అన్నీ పరిశీలించిన తర్వాత మీరు రేషన్ కార్డు పొందడానికి అర్హులు అయితే మీ మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత స్లిప్పులు తీసుకెళ్ళి మీసేవ కేంద్రంలో రేషన్ కార్డును సులువుగా పొందవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: