పై ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఐపీఎస్ ఆఫీసర్ పేరు ఆర్తి సింగ్. 2006లో ఈమె మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకి ఎస్పీగా బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు ఈమె బనారస్ హిందూ యూనివర్సిటీ లో ఎంబీబీఎస్ చదువు చదివి టాపర్ గా నిలిచారు. డాక్టర్ చదివిన ఆర్తి 2004వ సంవత్సరంలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి అలవోకగా ఐపీఎస్ ఉద్యోగాన్ని సంపాదించారు. అయితే తాను ఉద్యోగంలో చేరిన రోజు నుండి తన కిందిస్థాయి పోలీస్ అధికారులకు ఫిట్నెస్ గురించి అవగాహన కల్పించడం ప్రారంభించారు. పోలీసులంటేనే 24 గంటలపాటు డ్యూటీ చేస్తూ... ఎన్నో పని ఒత్తిడులతో సరిగా తినకుండా, నిద్రపోకుండా డ్యూటీలు చేస్తుంటారు. ఫలితంగా వారి మానసిక, శారీరక ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ విషయం బాగా తెలిసిన ఐపీఎస్ డా.ఆర్తి సింగ్ తమ పోలీస్ సిబ్బందికి మెడికల్ చెక్ అప్స్ చేయించి ఎవరెవరు ఎటువంటి ఆహారం ఏ టైంలో తీసుకోవాలో చెప్పేవారు.


ప్రస్తుతం ఈమె లీడ్ లో 4 వేల మంది ఎన్ ఫోర్స్ పోలీసులు 500 కిలోమీటర్ల పరిధిలో డ్యూటీలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా గత నెల రోజులుగా ఆ 4వేల మంది పోలీసులకు కంటి మీద కునుకులేదు. లాక్ డౌన్ విధులను అహోరాత్రులు నిర్వహిస్తూ ఎంతో శ్రమ పడుతున్న పోలీసులను లీడ్ చేసే ఎస్పీ ఆర్తి సింగ్ కూడా ప్రస్తుతం పెద్ద సవాలునే ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ విపత్కర సమయంలో ఒకవైపు పోలీస్ అధికారిణిగా... మరోవైపు డాక్టర్ గా కూడా ఈమె విధులను నిర్వహిస్తున్నారు. లాక్ టౌన్ డ్యూటీ చేస్తున్న ప్రతి ఒక్క పోలీసు వద్దకు వెళ్లి ఫేస్‌షీల్డ్స్, ఫేస్‌మాస్క్‌లను పంచుతూ... తన టీమ్‌ మేట్స్‌ కోసం ఏర్పాటు చేసిన క్యుబికల్స్‌లో వైద్య సదుపాయాలు ఉన్నాయో లేదో, హ్యాండ్ శానిటైజర్స్‌ అందరికీ అందుతున్నాయా లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


ఎంబిబిఎస్ లో టాపర్ గా నిలిచిన ఆర్తి సింగ్ గైనకాలజిస్ట్ అవ్వాలని అనుకున్నారు కానీ పోలీస్ అవ్వాలంటే ఓ కోరిక ఆమెలో గట్టిగా కలిగినప్పుడు... వెంటనే యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాశారు. వైద్యురాలు అయినా పోలీస్ ఆఫీసర్ అయినా సమాజానికి సేవలందించడమే కదా అని ఆమె చెబుతుంటారు. తనకు పోలీస్ ఆఫీసర్ గా, డాక్టర్ గా బాధ్యతలను నిర్వర్తించే అవకాశం లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెబుతుంటారు. ఈమె భర్త కూడా ఐపీఎస్ అధికారే. తాను ప్రస్తుతం ముంబాయి నగరంలో నిధులను నిర్వర్తిస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఇద్దరు పాపలు ఉన్నారు. వారిలో ఒకరి వయస్సు పదేళ్ళు కాగా మరొకరి వయసు నాలుగేళ్లు. అయితే కరోనా వైరస్ కారణంగా ఆర్తి సింగ్ తమ పిల్లలను దగ్గరికే రానివ్వడం లేదు. ఏది ఏమైనా ఆర్తి సింగ్ సమాజం కోసం చేసే సేవలు చాలా విలువైనవి అని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: