ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను క‌రోనా ర‌క్క‌సి వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించి అనేక మంది ప్ర‌జ‌ల‌ను బ‌లి తీసుకుంటుంది. తాజా లెక్కల ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య 19 ల‌క్ష‌ల 95 వేల 537కి చేరింది. వారిలో 4 ల‌క్ష‌ల 67 వేల 226 మంది రికవరీ అయ్యారు. ఇక మ‌ర‌ణాల సంఖ్య 1 ల‌క్ష 26 వేల 531కి చేరుకుంది. అయితే ప్రపంచంలోని కరోనా కేసుల్లో 30 శాతం కేసులు అమెరికాలోనే ఉన్నాయి. ఇక ఈ క‌రోనాను నియంత్రించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠిణ‌ చ‌ర్య‌లు చేప‌ట్టాయి. భార‌త్ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. 

 

భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండ‌డంతో కేంద్రం దాన్ని క‌ట్ట‌డి చేసేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంది. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కొత్త కొత్త ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇందులో భాగంగా క‌రోనా కొద్ది రోజులు సంతోషాన్ని ఇస్తే.. త‌ర్వాత ఏమ‌న్నా క‌ష్టాలు ఇస్తుందా..? ప‌్ర‌స్తుతం ఇదో పెద్ద చ‌ర్చ‌గా మారింది. ఏది సంతోషం అంటే రోగం రావ‌డం సంతోషం కాదు. ఈ వైర‌స్‌ వ‌ల్ల లాక్‌డౌన్ పేరుతో అంద‌రినీ ఇళ్ల‌కు ప‌రిమితం చేయ‌డం. క‌రోనా ప‌రంగా చూస్తే ఇది మంచి ఆలోచ‌నే. అయితే క‌రోనా కార‌ణంగా..  మహిళల పాలిట శాపంగా మారిందని అంటున్నారు.

 

ఇళ్లల్లో మహిళలపై ఒక్కసారిగా హింస పెరిగిపోయిందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లో లాక్‌డౌన్ విధించిన తొలివారంలో సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు స్థాయిలో మహిళలపై గృహ హింస పెరిగినట్టు ఇప్ప‌టికే వెల్ల‌డించారు. అయితే ఇక్క‌డ రెండు ర‌కాలు అయిన‌టువంటి క‌ష్టాలు ఉంటాయి.  అందులో ముందుగా క‌రోనా కార‌ణంగా ప‌నిమ‌నుషులు మ‌రియు ఇత‌రిత‌ర ప‌నులు చేసేవారిని ఇళ్ల‌కు రానివ్వ‌కుండా చేయ‌డం. ఎందుకంటే వాళ్ల ద్వారా క‌రోనా వ‌స్తుంద‌న్న భ‌యంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

 

అయితే ఇదే స‌మ‌యంలో ప‌ని విష‌యంలో మ‌హిళ‌ల‌పై ఎక్కువ ఒత్తిడి ప‌డుతుంది. దీంతో అప్ప‌టివ‌ర‌కు అల‌వాటు లేని ప‌నులు కుటుంబ‌స‌భ్యులు పంచుకోవ‌డానికి ఆంగీక‌రించ‌క‌పోవ‌డం ద్వారా మాట మాట పెరిగి గ‌ర్ష‌ణ‌కు తెర‌లేస్తుంది. అలాగే రెండొవ‌ది మద్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో లాక్‌డౌన్ కార‌ణంగా పెరిగే ఆర్థిక ప‌రిస్థితి. దీంతో అధిక ఒత్తుళ్లు.. ఇత‌రిత‌ర స‌మ‌స్య‌ల వ‌ల్ల గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఒక‌రిపై ఒక‌రు దాడుల‌కు దారితీస్తున్నాయి. క్ర‌మంగా ఇలాంటి కేసులు ఎక్కవ అవ్వ‌డంతో ప్ర‌భాత్వాలు కూడా వాటిపై దృష్టి పెట్టున‌ట్టు తెలుస్తోంది. ఏదేమైన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్టకాలంలో ఇలాంటి త‌క్కువ‌గా ఉండాల‌ని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: