ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా అన్న పేరు విన‌బ‌డితేనే ప్ర‌జ‌లు తీవ్ర భ‌యందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వ్యాక్సిన్ లేని ప్రాణాంతక కరోనా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్ కూడా అదే వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. ఇంత‌టి ప్రాణాంత‌క మ‌హ‌మ్మారిని మ‌ట్టుపెట్టేందుకు ప్ర‌పంచ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అలాంటి ఇలాంటి స‌మ‌యంతో హైడ్రాక్సీక్లోరోక్విన్ మెడిసిన్ క‌రోనాని క‌ట్ట‌డి చేస్తుందంటూ తెర‌పైకి వ‌చ్చింది. దీంతో ఇండియాలో అధికంగా త‌యార‌య్యే ఈ మందు కోసం ప్ర‌పంచ‌దేశాలు పోటీ ప‌డుతున్నాయి. బ్రిటీష్ వారి కాలంలో ఈ మందు క‌నుక్కున్నారు. అయితే వారి కాలంలో ఈ మందు క‌నుక్కున్నా.. క‌నుక్కున్న‌ది మాత్రం భార‌తీయుడే.

 

ఆ కాలంలో ఇక్క‌డ దోమ‌లు మ‌రియు తీవ్ర ప‌రిస్థితుల‌ను దృష్టి పెట్టుకుని ఈ మందును క‌నుక్కోవాల్సి వ‌చ్చింది. ఆ టైమ్ బెర‌డు, క‌షాయం లాంటివి వాడుతున్నప్పుడు.. భార‌తీయుడు అయినటువంటి ఓ శాస్త్ర‌వేత్త దీన్ని క‌నిపెట్టారు.  మలేరియాను మ‌ట్టుపెట్టే విశేష ఔష‌దం గుర్తింపు పొందిన‌టువంటి హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు క‌రోనాకు క‌ల్లెం వేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అమెరికా అధ్య‌క్ష‌డు ట్రంప్ స్వయంగా ప్ర‌ధాని మోదీకి ఫోన్ చేసి మాత్ర‌లు పంపాల‌ని కోరిన‌టువంటి దీనిని అస‌లు త‌యారు చేసిన వ్య‌క్తి  భార‌త ర‌సాయ‌న శాస్త్ర జాతిపిత ఆచార్య ప్ర‌ఫుల్ చంద్ర‌రాయ్. 

 

ఆచార్య ప్రఫుల్ చంద్ర‌రాయ్ ప్ర‌సిద్ధి గాంచిన శాస్త్ర‌వేత్త‌, ప్రొఫెస‌రే కాదు దేశ తొలి ర‌సాయ‌న ప‌రిశోధ‌కుడుగా దేశానికి వ‌న్నె తెచ్చారు. 1896లో స్టేబుల్ కంపౌండ్ మెర్కుర‌స్ నైట్రేట్‌ను కనుగొన్నారు. 1901లో దేశంలోనే తొలి ఫార్మాసిట్యూక‌ల్ సంస్థ‌ బెంగాల్ కెమిక‌ల్స్‌ను స్థాపించారు. ఈ సంస్థ నుంచి డ్‌-19కి మందుగా ఉప‌యోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను అత్య‌ధికంగా ఉత్ప‌త్తి చేస్తున్న లీడింగ్‌ కంపెనీగా చ‌రిత్ర పుటల్లో నిలిచింది. అప్ప‌టి వ‌ర‌కు క‌షాయంగా తీసుకున్న దీన్ని టాబ్లెట్‌గా రూప‌క‌ల్ప‌న చేసిన‌టువంటి వ్య‌క్తి  ప్ర‌ఫుల్ చంద్ర‌రాయ్.  మ‌లేరియా కోసం త‌యారు చేసిన హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దాన్ని రుమ‌టైడ్ ఆర్థ‌రైటీస్‌, లూప‌స్ వంటి వ్యాధుల చికిత్స‌కు అనేక ద‌శాబ్దాల నుంచి వాడుతున్నారు. అయితే హైడ్రాక్సీక్లోరోక్వీన్ ఔష‌దాన్ని క‌రోనాకు కూడా ఉప‌యోగించ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: