ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ ఉధృత‌మ‌వుతున్న క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఇప్ప‌టికే లాక్‌డౌన్ అమ‌లుకు పోలీస్ అధికారులు కేసులు న‌మోదు చేసేందుకు కూడా వెన‌కాడటం లేదు. వేల సంఖ్య‌లో వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నారు.   మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే కొన్ని జిల్లాలో ప‌దుల సంఖ్య‌లో కొత్త‌గా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలోనే అత్య‌ధికంగా 97కేసుల‌తో గుంటూరు మొద‌టి స్థానంలో కొన‌సాగుతుండ‌గా క‌ర్నూలు త‌ర్వాతి స్థానంలో ఉంది. విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాలు మిన‌హా మిగ‌తా అన్ని జిల్లాల‌ను క‌రోనా వైర‌స్ చుట్టేసింది. 

 

ఈ జిల్లాల‌కు వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా అన్ని దారుల‌ను మూసేశారు. వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ప్రాంతాల గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం చేస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. జిల్లాలవారీగా ఏ,ఏ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలో వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 13 వరకు కరోనా పాజిటివ్ కేసులు న‌మోదైన ప్రాంతాల గురించి  ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అలర్ట్  చేస్తున్నారు.  ఈ మేర‌కు సామాజిక మాధ్య‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌ను జాగురుక‌త చేస్తున్నారు. 

 

నోడల్ ఆఫీసర్ అలర్ట్ చేసిన ప్రాంతాలు జిల్లాల వారీగా ఈవిధంగా ఉన్నాయి.  గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్, బుచ్చయ్య నగర్.. అలాగే జిల్లాలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన ప్రాంతాలున్నాయి.  ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం.. కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదైన‌ట్లు పేర్కొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు,  కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం.. , చిత్తూరు జిల్లా వడమాలపేట.. శ్రీకాళహస్తి ప్రాంతాలతో పాటు మద్దూరు పరిధిలోని పాణ్యం, అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: