ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కి ఎంత విలవిలాడుతున్న ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనా దేశంలో మొదలైన ఈ వైరస్ కొద్దిరోజుల్లోనే ప్రపంచం మొత్తం విస్తరించింది. దీని దెబ్బకు ఏకంగా దేశాలు మొత్తమే లాక్ డౌన్ ని ప్రకటించాయి. దీనితో ప్రపంచంలోని అన్ని దేశాలలో సుమారు ప్రజలందరూ వారి వారి ఇళ్లకే పరిమితమయ్యారు అని చెప్పుకోవచ్చు. కొన్ని దేశాల్లో ప్రజలు ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వారు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారు.

 


దీనికి ఉదాహరణగా అమెరికా అని చెప్పుకోవచ్చు. అమెరికాలో ఈ రోజుకి పెరుగుతున్న కేసులు చూస్తే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది. అంతే కాదు దేశంలో ఐదు లక్షలకు పైగా కరుణ కేసులు పాజిటివ్ తేలడంతో అక్కడ పరిస్థితి దారుణంగా తయారయింది. ముఖ్యంగా న్యూయార్క్ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయింది. ఇక మన దేశానికి వస్తే ప్రస్తుతానికి 10 వేల కేసులకు చేరుకుంది. భారత ప్రధాని ముందు జాగ్రత్తగా లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా పెద్ద గండం నుంచి బయట పడ్డాము అని చెప్పుకోవచ్చు. ఎవరికి వారు సామాజిక దూరం పాటిస్తే ఈ వైరస్ ని త్వరగా అంతమొందించవచ్చని తెలుస్తోంది. అలాగే భారతదేశంలో మే 3 వరకు లాక్ డౌన్ ని పొడగించారు. అయితే ఈ లాక్ డౌన్ వివిధ దేశాల్లో వివిధ రకాలుగా అమలు పరుస్తున్నారు. వైరస్ ఎక్కువ తీవ్రత ఉన్న దేశాల్లో ఎక్కువ రోజులు ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారు.

 


ఇది ఇలా ఉండగా కరుణ వైరస్ ప్రభావం తగ్గి ఎత్తివేసిన తరువాత ప్రజలందరూ ఒక్కసారిగా బయటికి రావడం జరుగుతుంది. దీనితో మళ్లీ ప్రపంచం ఉరుకులు పరుగులు తీస్తుంది. యధావిధిగా జీవనం సాగిస్తుంది. ఈ పరిస్థితిని అంచనా వేసి ప్రపంచ శాస్త్రవేత్తలు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం తగ్గిన ఎలాంటి ఆంక్షలు లేకపోయినప్పటికీ 2022 సంవత్సరం వరకు ప్రజలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని వారు తెలుపుతున్నారు. లేకపోతే ఈ వైరస్ మళ్లీ తిరిగి ఆ టాక్ చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి ప్రజలు వీటిని నమ్ముతారా లేకపోతే మళ్లీ  ఈ వైరస్ కు బలి అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: