ప్రధాని  ప్రసంగానికి ముందు నుంచి వైసీపీ ప్రొజెక్ట్ చేసింది ఒక్కటే జోనల్ వ్యవస్థకు సంబంధించిన అంశం. రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ ల గురించి ప్రస్తావించారు.  కొన్ని తెలుగు పత్రికులు సైతం ఇదే విషయం పై మోదీ అలా అనుకుంటురని ప్రస్తావించాయి. ఇలా రాస్తున్న సందర్భంలా జగన్ ఎన్నికల సంబంధించే ఎత్తుగడ వేస్తున్నారని.. మరోపక్క ఎన్ని కమీషనర్ ని మార్చడం పై చర్చలు నడుస్తున్నాయి. అయితే మోడీ ప్రకటన తర్వాత తెలుగు దేశం అనుకూల మీడియా కొత్త చర్చలకు తెరపైకి తీసుకు వచ్చింది.. ప్రధాని మోదీ సీఎం జగన్ కి జల్లకాయ కొట్టారని ఆయన ఊహించిన వాటికి చెక్ పెట్టారని అంటున్నారు. ప్రత్యేకంగా జోనల్ వ్యవస్థ ద్వారా ఎన్నికలు జరపాలన్న జగన్ యోచనకు మోదీ బ్రేక్ వేశారని వార్తలు వస్తున్నాయి.  దానికి అనుకూలంగానే టీడీపీ నేతలు దానికి అనుకూల మీడియా కావొచ్చు ఈ అంవంపై హైలెట్ చేసుకుంటూ వస్తుంది.

 

వాస్తవానికి జగన్ మూడు జోన్లు ఆయన ఉద్దేశం కాదు.. కేంద్రం సైతం మూడు జోన్లు ప్రస్తావన పై ఆలోచనలు జరిపింది. అయితే జగన్ మాత్రం దాన్ని ఎన్నికలకు ఉపయోగించుకోవాలని అన్నట్టు.. రెడ్ జోన్ మినహాయించి మిగతా జోన్లలో ఎన్నికలు పెట్టాలని అర్జంట్ గా బార్డర్స్ దాటించి మరీ కనకరాజ్ ని తీసుకు వచ్చారని.. ఆయన ద్వారా ఎన్నికలు తీసుకు రావడానికి అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారని.. ఆ మీటింగ్ తో ఎన్నికలు కూడా రెడీ అవుతాయని భావించారు. ప్రధాని ప్రకటన ముందే అంతా సిద్దం చేసుకున్నారు.

 

ఈ నేపథ్యంలోనే ప్రధానికి లేఖ రాశారు.. ఒకవేళ లేఖ ద్వారా తన ప్రపోజల్ ఓకే అయి ఉంటే.. రెండు రకాల ప్రయోజనాలు పొంది ఉండేవారు.. ఒకటి జగన్ చెప్పిన మాట మోదీ విన్నారు.. మిగతా వాళ్లకు తెలియని విషయాలు ఆయనకు చెప్పి తన గొప్పతనం చాటుకున్నారని జగన్ ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా ఉంటాడని అనకుంటారు.. ఒకవేళ అలా కాకపోయి ఉంటే.. రెండో ప్రయోజంన ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలకు కూడా పోయేవాళ్లు అన్న విషయాన్ని తెలుగు దేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది.

 

ఇటు వైసీసీ ఈ విషయంజై ఎలాంటి స్పందన లేదు. నిన్నటి వరకు వారు చేసిన ప్రచారం లో జోనల్ వ్యవస్థ మారుతుంది.. జగన్ చెప్పిందే మోడీ చెప్పబోతున్నారని చెప్పుకొచ్చారు.. కానీ ఇఫ్పుుడ దానికి పూర్తి రివర్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో వారు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి. ఇదే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: