ప్రస్తుతం కరోనా వైరస్ చిక్కుల్లో పడిన ప్రపంచం... వైరస్ నుంచి బయటకు రావడానికి చాలా కష్టాలు పడుతుందనే చెప్పాలి. ఇక లాక్ డౌన్ విధానం అమలుతో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీనితో రవాణా వ్యవస్థలు వాణిజ్య వ్యాపార సంస్థలు అన్ని కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో స్తంభించింది. మరోవైపు లక్షల మంది కార్మికుల ఉద్యోగాల పరిస్థితి అయితే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పాలి. చాలా సంస్థలు ఉద్యోగులను విధుల నుంచి తొలగించాలని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది.

 


ఇది ఇలా ఉండగా ఆన్లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ వేలాది మంది ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధం అవుతుంది. కరోనా వైరస్ సంక్షోభ కారణంతో ఆర్డర్ల డిమాండ్ భారీగా పెరుగుతున్న దాంతో కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఈ సంస్థ. ఒకందుకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. అయితే ఇప్పటికే అమెరికాలో లక్షల మందికి పైగా అభ్యర్థులను విధుల్లోకి చేర్చుకోవడం జరిగింది. మరో 75 వేల మందిని కూడా నియమించుకోవాలి అంటున్నట్లు కూడా  బ్లాక్ పోస్ట్ లో తెలియజేయడం జరిగింది. దీనితో పాటు పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు వేతనాలు కూడా పెంచే దిశగా ఉంది. ఇక భారతదేశంలో మే 3 వరకు లాక్ డౌన్ విధానాన్ని పొడిగించిన సంగతి అందరికి తెలిసిందే కదా. ఏప్రిల్ 20 నుంచి కొన్ని అత్యవసర సేవలకు సంబంధించి మార్గదర్శనం నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్న ఎలాంటి స్పష్టత కనబడటం లేదు. 

 

 

ఇక అమెజాన్ కంపెనీ కరోనా వైరస్ కారణంగా సంభవిస్తున్న ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగ నష్టాలను అధికమించి సహాయం చేస్తున్నామని తెలియజేసింది. ముఖ్యంగా ఈ నిర్ణయానికి తీసుకోవాడానికి గల కారణం ఏమిటి అంటే లాక్ డౌన్ తరుణంలో ఆన్లైన్ సేవలకు పెరుగుతున్న డిమాండ్ ను అనుసరించి రవాణా కోసం చాలా మందిని విధులలోకి తీసుకుంటున్నట్లు కంపెనీ తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ఆర్డర్లు తీసుకొని సరైన సమయంలో వాటిని డెలివరీ చేస్తామని కంపెనీ అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక ఉద్యోగుల భద్రత కోసం టెంపరేచర్ తనిఖీ, శానిటైజింగ్, మాస్క్ లు వంటి భద్రతా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని కంపెనీ స్పష్టంగా తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: