ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా పేరు చెబితే ఉలిక్కి పడుతున్నారు.  ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే లక్ష మరణాలు.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.  దేశంలో కరోనా వైరస్‌ మరింతగా విస్తరిస్తోంది. గడచిన రెండు రోజుల్లో  కరోనా కేసుల  సంఖ్య 28 శాతం పెరిగింది. మంగళవారం రాత్రి వరకు కేంద్రం ఆరోగ్య శాఖ ఇచ్చిన సమాచారం మేరకు దేశంలోఓ 10,815 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 48 గంటలతో పోలిస్తే  ఈ రెండు రోజుల్లో తీవ్రత  కాస్త ఎక్కువగా  ఉంది. కేసుల వృద్ధి ఇలానే ఉంటే మరో ఆరు రోజుల్లో  మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 20 వేలకు చేరనుంది.

 

వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోతే పరిస్థితి చేయిదాటి, కొన్ని నెలల్లోనే  దేశంలోని ఆసుపత్రులన్నీ నిండిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడునిత్యం వాడే కరెన్సీతో కరోనా వ్యాప్తి చెందుతుందా అంటే అవుననే అంటున్నారు.  తాజాగా గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించిన తరువాత ఈ నిర్థారణకు వచ్చారు. ప్రస్తుతం క్రయవిక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు.

 

గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు.  కరోనా కనిపించని వైరస్.. అది ఎక్కడ ఎలా ఉంటుందో.. ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పలేని పరిస్థితి.. అందుకే సాద్యమైనంత వరకు డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: