కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూ.. జనన మరణాలను శాసిస్తోంది. ప్రపంచంతా స్థంభించిపోయింది. సరైన వైద్య సదుపాయాలు లేక అన్ని దేశాలు అల్లాడిపోతున్నాయి. ఉన్న మెడికల్‌ సిబ్బంది అంతా కరోనాపై యుద్ధం చేస్తోంది. ఇటువంటి సమయంలో ప్రెగ్నెన్సీ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. వీలైతే ప్రెగ్నెన్సీని డిలే చేసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు..

 

కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. భారత్‌లో రోజుకు వెయ్యిమందికి ఈ వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అవుతోంది. కరోనా బలాన్ని పెంచుకున్ని సామాజిక వ్యాప్తి దశలోకి చేరుకుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు సరైన మందు కూడా లేదు. గతంలో వ్యాపించిన వైరస్‌లకు వినియోగించిన డ్రగ్‌లనే దీనికి వినియోగిస్తున్నారు. వైరస్‌ సోకినా తట్టుకోవాలంటే.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

కరోనా వైరస్ ప్రభావం, వృద్ధులు.. చిన్నపిల్లలతో పాటు, గర్భిణీలపై ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్లు మూడు నుంచి నాలుగు నెలల వరకు వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్యులు. ఇప్పటికే ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పడు.. వైద్యుల సలహాలు పాటించాలని సూచిస్తున్నారు. 

 

ప్రెగ్నెన్సీ మొదలైన తర్వాత మొదటి మూడు నెలలు చాలా కీలకంగా భావిస్తారు. వీరికి వైరస్‌ సోకితే అబార్షన్‌కు దారితీసే ప్రమాదం ఉందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఫెర్టిలిటీ ట్రీట్మెంట్‌లను కూడా వైద్యులు వాయిదా వేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150 మంది గర్భిణీలు కరోనా బారిన పడ్డారు.. ప్రస్తుతం వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైరస్ భారిన పడితే తల్లీ.. పిల్లల ఆరోగ్యానికే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అందుకే ప్రెగ్నెన్సీని కాస్త ఆలోచించి ప్లాన్ చేసుకుంటే మంచిదంటున్నారు వైద్యులు. 

 

ఇప్పుడున్న హైబ్రిడ్ జీవితంలో సహజంగానే గర్భిణీల్లో అనేక లోపాలు.. ఆరోగ్యపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఐరన్ సహా అనేక విటమిన్ లోపాలు తలెత్తుతున్నాయి. గర్భం దాల్చిన మొదటి రోజు నుంచీ.. అనేక రకాల మందులు వాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో గర్భం దాల్చే విషయంలో.. వెనుకడుగు వేయడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: