ప్రపంచాన్ని మొత్తం మనశ్శాంతిగా లేకుండా చేస్తుంది కరోనా వైరస్.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ భయంకరమైన వైరస్ ప్రపంచంలోని 202 దేశాలకు విస్తరించింది.  లక్షకు పైగా మరణాలు సంబవించాయి.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.  మన దేశంలో కరోనాని కట్టడి చేయడానికి గత నెల 24 నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టాం.. నిన్నటితో ముగియాల్సి ఉన్నా కరోనా వైరస్ ప్రభావంతో మే 3 వరకు పొగిడిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించిన నిన్న మాట్లాడారు.  తాజాగా కోవిడ్-19పై జరుపుతున్న పోరాటంలో రాబోయే మూడు వారాలు భారత్‌కు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.

 

జనవరి 7న కరోనా వైరస్‌ను చైనాలో గుర్తించగానే మొదట స్పందించిన దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు.  జనవరి 8న నిపుణుల బృందంతో సమావేశం ఏర్పాటు చేశామని, జనవరి 17న హెల్త్ అడ్వయిజరీలు  విడుదల చేశామని చెప్పారు. కరోనా ప్రభావం ముంబైపై తీవ్రంగా ఉందని హర్షవర్ధన్ తెలిపారు. దేశవ్యాప్తంగా రోజుకు లక్ష పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నామని, ఇంతవరకూ 2.5 లక్షల పరీక్షలు జరిపామని ఆయన చెప్పారు. 

 

 కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న దేశాల్లో ఇండియా మొదటి వరుసలో ఉందని అన్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఒకర ఉదాహరణగా నిలిచిందని చెప్పారు.166 ప్రభుత్వ ల్యాబ్స్ పనిచేస్తున్నాయని, ల్యాబ్‌లు, పరీక్షల అప్‌గ్రేడేషన్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హాట్‌స్పాట్‌లు, పాజిటివ్ కేసులపై నిరంతర నిఘా ఉందని అన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: