గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని జీవోలను జారీచేసిన సంగతి విదితమే. అయితే జగన్ సర్కార్ జారీచేసిన 81, 85 జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది అయిన ఇంద్రనీల్ వేసిన పిటిషన్ పై, ఇంకా ప్రభుత్వ తరపు న్యాయవాదులు చేసిన వాదనలను 11 నెలల పాటు విన్న హైకోర్టు ఈరోజు జీవోలను కొట్టివేసింది. ఇంగ్లీష్ మీడియం ఎంపిక చేసుకునే అవకాశం పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు తప్పనిసరిగా ఉండాలని... అంతేకానీ ఎవరు కూడా బలవంతంగా ఇంగ్లీష్ మీడియం లో చేరేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండకూడదని ఇంద్రనీల్ చేసిన వాదనలకు హైకోర్టు మొగ్గు చూపి ఈ తీర్పును వెలువరించింది. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యతిరేకతను చూపారు.



ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ నిర్ణయాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... 'మీరు తెలుగు పత్రికలను ప్రచురిస్తూ తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం చాలా బాధాకరం. ఒక పాఠశాలలో కేవలం ఒకే ఒక విద్యార్థి తెలుగు మీడియంలో చదువుకుంటాను అంటే తనకి తెలుగు మీడియంలో చదువు చెప్పే బాధ్యత మీమీద ఉంది. మీరు కేవలం ఇంగ్లీషు మాధ్యమానికి ప్రాముఖ్యత ఇవ్వటం భారత రాజ్యాంగాన్ని అగౌరవ పరచడమే. మీ ఇష్టానికి మీరు చేసుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి మీమేమి గాజులు వేసుకోలేదు ఇక్కడ. జగన్ రెడ్డి గారికి కానీ మిగతా 150 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు గానీ నేను ఒక్కటే చెబుతున్నాను... మీరు తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మంట కలిసిపోతారు మట్టి కొట్టుకు పోతారు ఇది గుర్తుంచుకోండి' అని ఆయన ఒక ఘాటైన ప్రసంగాన్ని ఇచ్చారు.


అలాగే అనేక సందర్భాలలో సోషల్ మీడియాలో తెలుగు యొక్క ప్రాముఖ్యత గురించి పోస్టులు పెడుతూ ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి కాకూడదని ఎన్నోసార్లు కోరుకున్నారు. అయితే ఎట్టకేలకు ఈ రోజు జగన్ కోరికను కాకుండా పవన్ కళ్యాణ్ కోరికను హైకోర్టు తీర్చిందని చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: