పవన్ కళ్యాణ్... ఈయన సినిమాల్లో ఉన్నప్పుడు పవర్ స్టార్.. రాజకీయాల్లోకి వచ్చాక జనసేనాని. నిజానికి ఈయన సినిమాలు పక్కనపెట్టి రాజకీయాల్లోకి రావడం ఒక గొప్ప విషయమే అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నుంచి రాజకీయ రంగానికి అడుగులు వేసిన అభిమానులులలో మాత్రం పవన్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 2014 సంవత్సరం ఎన్నికల ముందే జనసేన పార్టీ ఏర్పడినప్పటికీ ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వగా చంద్రబాబు సీఎం కావడంలో మాత్రం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పరిస్థితులు బట్టి 2019 ఎన్నికల్లో జనసేన డైరెక్ట్ గా బరిలో దిగడంతో ఏపీలో త్రిముఖ పోరు ఏర్పడింది.

 


ఎన్నో అంచనాల మధ్య 2019 ఎన్నికల్లో జనసేన బరిలోకి దిగింది. నిజానికి అందరూ జనసేన అన్న ప్రజారాజ్యం పార్టీ లాగా కనీసం 30 నుంచి 40 సీట్లు మధ్యలో గెలుస్తుంది అని అనుకున్నారు. కానీ  వైఎస్ఆర్సిపి పార్టీ గాలి గట్టిగా ఉండడంతో పవన్ కళ్యాణ్ తో సహా జనసేన పార్టీ అభ్యర్థులందరూ (ఒక్కరు మినహా) రాష్ట్రంలో ఎక్కడా గెలవలేక పోయారు. సీట్ల నెంబర్ల పక్కనపెడితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జనసేన పార్టీ ఓట్లు బాగానే వచ్చాయని చెప్పుకోవచ్చు.

 


ఏది ఏమైనా నా జనసేన పార్టీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం తన మాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేగాక పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా విపత్తు జరుగుతే పవన్ కళ్యాణ్ ముందు ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ముందు ఉండడమే కాకుండా వారికి అవసరమైన సహాయాన్ని అందించడంలో ఒక అడుగు ముందే ఉంటాడు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ జనసేనను ముందుకు నడిపి తెలుగు రాష్ట్రాల్లో మార్పులు సృష్టిస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: