భారతదేశంలో అత్యధిక సంపన్నులు అని అంటే వినిపించే మొదటి పేరు అంబానీ. అదికూడా ముఖేష్ అంబానీ. ఆయన తర్వాతే భారతదేశంలో సంపన్నుల జాబితా మొదలవుతుంది. ఈయన కేవలం భారతదేశంలోనే సంపన్నుడు కాకుండా ప్రపంచంలోని టాప్ సంపన్నులు కూడా ఈయన ఒకరు. భారతదేశంలో వివిధ రంగాల్లో తన కంపెనీ యొక్క ఉనికి చాటుతూ వ్యాపారంలో అగ్ర స్థానానికి చేరుకుని ఈ తరహా సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు. భారతదేశంలో ఆయన మొదటి వ్యక్తిగా కొనసాగుతున్న ప్రపంచంలో మాత్రం 18వ ఆస్థానంలో ఉన్నారు.

 


అయితే రోజూ అదే పరిస్థితి ఉండదు కదా. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సంపన్నుల ఆస్తులు ట్రేడ్ మార్కెట్లో ఆవిరై పోతున్నాయి. ఈ దెబ్బతో ముకేశ్ అంబానీ ప్రపంచంలో తన స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన స్థానాన్ని అమెజాన్ అధినేత మాజీ భార్య మెకంజీ బెజోస్ ఆక్రమించింది. ఇప్పుడు ఆవిడ ముకేశ్ అంబానీ కంటే సంపన్నురాలు. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం... మెకంజీ ఆస్తి విలువ ఏప్రిల్ 10వ తారీఖుకి 8.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీనికి కారణం అమెజాన్ షేర్ వాల్యూ 5.3 శాతం పెరగడమే ఇందుకు కారణం. నిజానికి అమెజాన్ లో మెకంజీకి నాలుగు శాతం వాటా ఉంది. భర్త నుండి విడాకులు అందుకున్న తర్వాత భరణం కింద ఆమెకు ఈ వాటా లభించింది.

 


అయితే ప్రస్తుతం ఆవిడ సంపదలో ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని ఆవిడ ఆక్రమించారు. అయితే ప్రపంచంలో మహిళల సంపన్న జాబితాలో మెకంజీ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 138.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్ 15 నాటికి ఆయన సంపద విలువ 24 డాలర్లు పెరిగింది. అలాగే ముకేశ్ అంబానీ సంపద విలువ ఇస్తే 34.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే మెకంజీ సంపద విలువ 45.3 బిలియన్ డాలర్లుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: