లాక్‌డౌన్‌ను ద‌శ‌ల వారీగా ఎత్తివేసేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. నిపుణులు ఊహించిన‌ట్లుగానే క‌రోనా ప్ర‌భావిత ప్రాంతాల‌ను, ప్ర‌భావం అంత‌గాలేని ప్రాంతాల‌ను..అస‌లు క‌రోనా న‌మోదు కాని ప్రాంతాలుగా విభ‌జిస్తూ కేంద్రం ఓ జాబితాను విడుదల చేసింది. అయితే ఏప్రిల్ 20త‌ర్వాత లాక్‌డౌన్‌ను స‌మీక్షిస్తామ‌ని ప్ర‌ధాన‌మంత్రి మోదీ చెప్పిన విష‌యం తెలిసిందే. దానిక‌నుగుణంగానే లాక్‌డౌన్ స‌డ‌లింపున‌కు చ‌ర్య‌లు ఆరంభ‌మ‌వుతున్నాయి. కేంద్రం విడుద‌ల చేసిన జాబితా ప్ర‌కారం.. దేశవ్యాప్తంగా  170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా, 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్‌లుగా, మిగిలినవాటిని గ్రీన్ జోన్లుగా  గుర్తించారు. 

 

దేశవ్యాప్తంగా  170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్‌లుగా, 207 జిల్లాలను నాన్ హాట్‌స్పాట్‌లుగా, మిగిలినవాటిని గ్రీన్ జోన్లుగా  గుర్తించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.  ఇక  రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి రెండు క్ల‌స్ట‌ర్లుగా విభ‌జించింది. అందులో క‌రోనా ప్ర‌భావం ఎక్కువగా ఉన్న జిల్లాలు,  క్లస్టర్లలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉన్న జిల్లాలు ఉన్నాయి.  ఏపీలో హాట్ స్పాట్  జిల్లాలు ఈ విధంగా ఉన్నాయి..  ప్రకాశం, కృష్ణ, కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, అనంతపురం. 

 

ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే  హాట్ స్పాట్ (లార్జ్ ఔట్‌బ్రేక్) జిల్లాలు: హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, మేడ్చల్-మల్కాజిగిరి, కరీంనగర్, నిర్మ‌ల్‌,  ఇక తెలంగాణ‌లో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, : సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే హాట్‌స్పాట్ నుంచి నాన్- హాట్‌స్పాట్.. నాన్- హాట్‌స్పాట్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు చేయనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: