ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ విష‌యంలో చైనా తీరు మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. ఈ మ‌హ‌మ్మారి వైర‌స్‌కు చైనాయే కార‌ణ‌మ‌ని తేలిపోయింది. ఆ దేశం చేసిన ప‌నుల వ‌ల్లే....క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంద‌ని తేలింది. నోవెల్ క‌రోనా వైర‌స్ సంక్ర‌మిస్తున్న తీరుకు సంబంధించి భార‌త‌దేశానికి చెందిన‌ ఐసీఎంఆర్ డాక్ట‌ర్ గంగా ఖేద్క‌ర్ తాజాగా ఇవాళ మీడియాతో ఈ సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాజా ప్ర‌క‌ట‌న‌తో అయినా చైనా త‌న దుర్మార్గాన్ని మానుకుంటోందో వేచి చూడాల్సిందే.

 

క‌రోనా వైర‌స్ గురించి వివ‌రిస్తూ చైనాలో జ‌రిగిన స్ట‌డీ ఆధారంగా క‌రోనా వైర‌స్‌.. గ‌బ్బిలాల్లో జ‌రిగిన జ‌న్యు ప‌రివ‌ర్త‌న ద్వారా వ్యాపించిన‌ట్లు చెప్పారు. గ‌బ్బిలాత‌ నుంచి ఆ వైర‌స్‌.. పంగోలిన్స్‌కు ట్రాన్స్‌మిట్ అయ్యింద‌ని,  పంగోలిన్స్ నుంచి మ‌నిషిలో క‌రోనా వైర‌స్ ప‌రివ‌ర్త‌న చెందిన‌ట్లు గంగాఖేడ్క‌ర్ తెలిపారు. క‌రోనా వైర‌స్ సాధార‌ణంగా గ‌బ్బిల్లాలో ఉంటుంద‌న్నారు. గ‌బ్బిలాల్లో జ‌రిగిన మ్యుటేష‌న్ల వ‌ల్ల మ‌నిషి వ‌ర‌కు వైర‌స్ చేరి ఉంటుంద‌న్నారు. `మేం చేప‌ట్టిన నిఘా ప్ర‌కారం రెండు ర‌కాల గ‌బ్బిలాలను గుర్తించాం. కానీ ఆ గ‌బ్బిల్లాల్లో మ‌నుష‌ల‌కు సంక్ర‌మించే వైర‌స్ లేద‌ని గుర్తించాం. గ‌బ్బిలాల నుంచి మ‌నిషి వైర‌స్ సోక‌డం అనేది అత్యంత అరుదైన విష‌యం. వెయ్యేళ్ల‌కు ఒక‌సారి గ‌బ్బిలాల నుంచి మ‌నుష‌లకు వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశం ఉంది` అని గంగా ఖేద్క‌ర్ తెలిపారు. 

 

కాగా, ఈ ప్రాణాంతక వైరస్‌ పుట్టింది చైనాలో అయినా ఎక్కువగా ప్రభావితమైనది మాత్రం ఐరోపా దేశాలు. ఐరోపాలో పది లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఖండంలోని ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్యలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయంటే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఐరోపాలో ఇప్పటివరకు 10,03,284 కరోనా కేసులు నమోదవగా, 84,465 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 20,08,251 కేసులు నమోదవగా, 1,27,168 మంది మరణించారు. ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఇప్పటివరకు స్పెయిన్‌లో 18255 మంది, ఇటలీలో 21,067 మంది, ఫ్రాన్స్‌లో 15,729 మంది, జర్మనీలో 3495 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: