కరోనా ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకూ ఎక్కువతున్న విషయం తెలిసిందే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు తక్కువే నమోదైన, తర్వాత మాత్రం ఢిల్లీ మర్కజ్ యాత్రకు వెళ్లొచ్చిన వారితో మరింతగా ఎక్కువైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కరోనా ప్రభావం ఉంది.

 

అయితే కరోనా వ్యాప్తి అరికట్టడంలో వైసీపీ ప్రభుత్వం కూడా బాగానే కృషి చేస్తోంది. వాలంటీర్లు, ఆశా వర్కర్స్ ద్వారా ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నారు. ఇక ఎక్కువ మొత్తంలో కరోనా టెస్టులు చేయిస్తున్నారు. కరోనా రోగులని, క్వారంటైన్ లో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకుంటుంది. అటు లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటుంది.

 

ఇక ప్రభుత్వం ఎంత చేస్తున్న చంద్రబాబు మాత్రం విమర్శించడం ఆపడంలేదు. ప్రభుత్వం కరోనా కేసులని దాస్తోందని, మరణాలని కూడా దాచిపెట్టిందని ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ని విమర్శిస్తూనే,  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు తీసుకొచ్చారు. ట్రంప్ ఉదాసీనత వల్లే అమెరికా భారీమూల్యం చెల్లించుకుందన్నారు. అలా జగన్ ని విమర్శిస్తూ, ట్రంప్ పేరు తీసుకు రావడంలో ఓ కారణముంది. అమెరికాలో కరోనా తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ లక్షల్లో కరోనా కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. పైగా కరోనా వ్యాప్తికి ట్రంప్ సరైన చర్యలు తీసుకోవడం లేదు. లాక్ డౌన్ విధించలేదు.

 

అయితే ఏపీలో కూడా జగన్ ప్రభుత్వం కరోనా వ్యాప్తికి సరైన చర్యలు తీసుకోవడం లేదని పరోక్షంగా బాబు విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇటీవల ప్రధానితో మాట్లాడేప్పుడు, లాక్ డౌన్ సడలింపు ఇచ్చి, జోన్ల వారీగా అమలు చేస్తే బాగుంటుందని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక అలా చేస్తే కరోనా కేసులు పెరుగుతాయని బాబు, జగన్ పై విరుచుకుపడుతున్నారు.

 

కానీ బాబు చేసే విమర్శలకు ఎలాంటి అర్ధం లేదని, జగన్ ప్రభుత్వం కరోనా వ్యాప్తి అరికట్టడంలో తీసుకుంటున్న చర్యలని బట్టి అర్ధమవుతుంది. పైగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మే 3 వరకు లాక్ డౌన్ నిర్ణయం ఏపీలో కూడా కొనసాగనుంది. ఒకవేళ జోన్ల వారీగా లాక్ డౌన్ పెట్టిన జగన్ ప్రభుత్వం హ్యాండిల్ చేయగలదు. ఆ విషయం గత కొన్ని రోజులుగా ప్రభుత్వ పనితీరుని చూస్తేనే అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: