భజన ఈ పేరు వింటే ఎక్కువ టీడీపీ పార్టీనే గుర్తొస్తుంది. ఎందుకంటే టీడీపీలో ఉండే కొంతమంది భజనబృందం ఎప్పుడు చంద్రబాబు చుట్టూ చేరి భజన చేస్తుంటారు. మహాప్రభో మీ లాంటి నాయకుడు లేని లేడని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఇక వారి భజనకు బాబు కూడా ముగ్ధులై, వారి మాట వినడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే గత ఐదేళ్లు భజన బృందం మాట విని చివరికి 23 సీట్లకు వచ్చేసారు.

 

అయితే దారుణంగా ఓడిపోయినా, భజనబృందం భజన ఆపలేదు. ఇంకా అదే పనిలో బిజీగా ఉంటున్నారు. ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే...బాబు కూడా తన డప్పు తానే ఎక్కువ కొట్టుకుంటున్నారు. తాజాగా ఆయన ప్రధాని మోదీతో మాట్లాడి, కరోనా వ్యాప్తి అరికట్టడంపై సలహాలు ఇచ్చినట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇక ప్రధానితో మాట్లాడినట్టు బాబే చెప్పుకోవడం ఎబ్బెట్టుగా ఉంది అనుకుంటే, ఆయన ప్రధానితో మాట్లాడారని వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించడం మరీ కామెడీగా ఉంది. పైగా విజయసాయిరెడ్డి దుస్తులు ఎందుకు చించుకుంటున్నారన్నారు.

 

అసలు బాబు మాట్లాడితే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడతారనే దానికి ఏ మాత్రం అర్ధం లేదు. అయితే  బాబే పీఎంఓకు చేసి, ప్రధానితో మాట్లాడాలని రిక్వెస్ట్ చేసుకోవడం, తర్వాత ప్రధానితో మాట్లాడి సలహాలు ఇచ్చిన విషయం ఏ మీడియా ద్వారా తెలియలేదు. ఆ విషయాన్ని స్వయంగా బాబే చెప్పుకున్నారు. ఇక అలా చెప్పుకోవడం వల్ల ఆయన స్థాయి దిగజారిందనే అర్ధం అవుతుంది. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత, ఇప్పుడు ఇలా పీఎంతో మాట్లాడాలని, రిక్వెస్ట్ చేసుకునే స్థాయికి వచ్చేసారంటే పరిస్థితి ఎక్కడవరకు వచ్చిందో తెలుస్తోంది.

 

ఇక  చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకుని, తన పరువు తానే తీసుకుంటే, ప్రధానితో మాట్లాడటం వల్ల వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారని మాట్లాడి బుద్దా వెంకన్న ఉన్న పరువు మొత్తం తీసేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: