ప్రస్తుతం ప్రపంచమంతా ఒకటే టాపిక్ మీద నడుస్తోంది. ఏ విషయమైనా కరోనాతో లింక్ అయి ఉంటుంది. మెడిసిన్ లేని ఈ మహమ్మారిని ఏ దేశం కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు అన్ని దేశాల్లో పాకేసింది. ఇక ఈ కరోనా మనదేశంలో కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

 

దాదాపు 11 వేలపైనే ప్రజలు ఈ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. అయితే కరోనాని కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం కష్టపడుతుంది. ఇప్పటికే ఆర్ధిక భారం ఉన్నా, సరే ప్రజల ప్రాణాలని రక్షించడానికి మరోసారి లాక్ డౌన్  విధించింది. మే 3 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. ఇక లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటుంది.

 

అయితే కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు ప్రతిపక్షాలకు కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి. కాకపోతే మోదీ ఆర్ధిక పరిస్థితిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పడం లేదని, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు, వలస కార్మికులని ఆదుకోవడంలో మోదీ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని ఆరోపిస్తున్నారు.

 

ఇదే సమయంలో మరో విషయంలో కూడా మోదీ ప్రభుత్వం చేసిన ప్రకటనని పూర్తిగా తప్పుబడుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ... జనవరి 7న కరోనా వైరస్‌ను చైనాలో గుర్తించగానే మొదట స్పందించిన దేశాల్లో భారత్ ఒకటని,  జనవరి 8న నిపుణుల బృందంతో సమావేశం ఏర్పాటు చేశామని, జనవరి 17న హెల్త్ అడ్వయిజరీలు  విడుదల చేశామని చెప్పారు. కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న దేశాల్లో ఇండియా మొదటి వరుసలో ఉందని అన్నారు.

 

అయితే ఇదే విషయంలో ప్రతిపక్షాలు విభేదిస్తున్నాయి. వైరస్ గుర్తించినప్పడే చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదని, రాహుల్ గాంధీ ఫిబ్రవరి 12నే వైరస్ గురించి హెచ్చరించిన కేంద్రం పట్టించుకోలేదని, ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆపలేదని, అందుకే కరోనా మహమ్మారి ఇప్పుడు పెరిగిపోయిందని అంటున్నారు. ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, కానీ అప్పుడే ఆ చర్యలు తీసుకుని ఉంటే ఈ స్థాయిలో కరోనా కేసులు ఉండేవి కాదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: