చైనా దేశంలో పుట్టిన కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది చనిపోతుంటే, లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వల్ల అమెరికా మరియు యూరప్ దేశాలు తీవ్ర స్థాయిలో తమ దేశ ప్రజలను పోగొట్టుకోవడం జరిగింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే ఈ వైరస్ వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడింది. చాలావరకూ దేశాలు ఈ వైరస్ ని ఎదుర్కోవాలంటే మందు లేకపోవటంతో నియంత్రణ ఒకటే మార్గం కావడంతో లాక్ డౌన్ అమలులోకి తీసుకు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో చైనాలో వైరస్ ఇంత తీవ్రత గా ఉన్న టైంలో ముందుగానే ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయాల్సిన చైనా మరియు 'WHO' సంస్థలు ఏం చేస్తున్నాయి అంటూ ఇటీవల డోనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

 

ప్రస్తుతం ప్రపంచంలో అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలో కరోనా వైరస్ వల్ల వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చైనా కి తొత్తుగా 'WHO' వ్యవహరిస్తుందని ట్రంప్ మండిపడుతున్నారు. అసలు చైనా చేసిన తప్పును ఇప్పటి వరకు ఖండించకుండా 'WHO' ఏం చేస్తుంది అంటూ తీవ్ర స్థాయిలో చెలరేగిపోయారు. దీంతో 'WHO' కు అమెరికా ఇక నిధులు ఇవ్వ‌ద‌ని ట్రంప్ తేల్చారు. అంతే కాదు.. అప్పుడే ఆ కోత అమ‌ల్లోకి కూడా తీసుకు రావటం జరిగినట్టు తెలుస్తోంది. వ‌ర‌ల్ఢ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ కు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుల్లో అమెరికా ఇచ్చే నిధులు కూడా ముఖ్య‌మైన‌వి. ఆ సంస్థ‌కు వ‌చ్చే మొత్తం నిధుల్లో 15 శాతం అమెరికా నుండి వస్తాయి.

 

ఆ తర్వాత 85 శాతం నిధులు మిగతా దేశాల నుండి వస్తాయని సమాచారం. కాగా ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ బాటలోనే మోడీ కూడా నడవాలని ఆలోచిస్తున్నారట. భారతదేశం నుండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ఇంక నిధులు ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయి ఉండి ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ నుండి ప్రపంచ దేశాలను కాపాడలేక పోవడం లో హెచ్చరిక చేయటంలో ఫెయిల్ అయిందని మోడీ  బలంగా నమ్ముతున్నారు అని సమాచారం. అయితే ఈ విషయంలో డోనాల్డ్ ట్రంప్ మరియు మోడీ… కరోనా వైరస్ ని ఉద్దేశపూర్వకంగా కావాలని ప్రపంచంలోకి చైనా వదిలింది అన్న దాని విషయం పై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లాలని… కోర్టులో చైనా దేశాన్ని అదే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నీ నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: