ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంబిస్తోంది. మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే తక్కువ కేసు నమోదు అయినప్పటికీ... ఆ తర్వాత మాత్రం రోజురోజుకూ కరోనా  వైరస్ కేసు పెరిగిపోతుండటం ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మార్కజ్  సమావేశానికి వెళ్లి వచ్చిన వారి నుండి లేదా విదేశాల నుంచి వెళ్లి వచ్చిన వారి నుండి కరోనా వైరస్ వ్యాప్తి  జరుగుతుంది. అయితే కరోనా  వైరస్ మనిషి నుంచి మనిషికి సోకుతుంది అన్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ బారిన పడిన మనిషి తుమ్మినా దగ్గినా కరోనా ఎదుటి వ్యక్తికి సోకుతుంది. 

 


 ఈ వైరస్ కి సరైన విరుగుడు లేదు .. ఈ నేపథ్యంలోనే ఎదుటివారి సొమ్ము మనాపైన  పడుకోకుండా చూసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. అంతేకాకుండా ప్రజలందరూ సామాజిక దూరం  పాటించాలని కేంద్ర ప్రభుత్వం అటు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు. తాజాగా  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రోజు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది. కరోనా కట్టడికి మరిన్ని కఠిన నిబంధనలు అమలులోకి తెస్తోంది జగన్ సర్కార్. 

 అయితే   వైరస్ వ్యాప్తికి కరెన్సీ నోట్ల మార్పిడి కూడా ఒక ముఖ్య కారణం కాబట్టి ప్రస్తుతం కరోనా వ్యాప్తి   జరగకుండా ఉండేందుకు కరెన్సీ నోట్ల మార్పిడి తగ్గించాలి అంటూ  జగన్ సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర ప్రజలందరూ కరోనా తో మేబెలెత్తిపోతున్న  నేపథ్యంలో కేవలం డిజిటల్ మనీ మాత్రమే ఉపయోగించుకోవాలని... కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకోవద్దు సూచించింది. ఎందుకంటే కరెన్సీ నోట్లు ఎంతో మంది చేతిలో నుంచి తాకుతూ మన దగ్గరికి వస్తే ప్రాణం పోయే  అవకాశం ఎక్కువగా ఉంది అంటున్నారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: