ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తూ  ఎంతో మందిని బలితీసుకున్న మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  శక్తుల ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా చూసుకుంటూనే  మరోవైపు లాక్ డౌన్  విధిస్తూ ప్రజలందరూ ఇంటికే పరిమితం చేస్తూ కరోనా వైరస్పై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక దూరం పాటించాలని ప్రజలందరూ ఇంటి నుంచి బయటకు రాకూడదు అని సూచిస్తున్నారు. సామాజిక దూరం పాటించకపోతే కరోనా  వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరిగిపోతుందని అంటున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ..రోజురోజుకి కరోనా  బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. 

 


 దీనికి కారణం నిర్లక్ష్యం.. చాలామంది కరోనా  వైరస్ నిర్లక్ష్యం చేసిన కారణంగా రోజురోజుకు భారతదేశంలో కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఒక వ్యక్తి తనను తాను హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నమే ప్రస్తుతం లక్షలాది మందిని రోడ్డు మీద పడేలా చేసింది. దీనికి నిదర్శనం నిన్న ముంబైలో జరిగిన ఘటన. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కరోనా  సమయంలో వైరస్ విస్తరించేందుకు చేశాడా ఇంకేదైనా కారణం ఉందా అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ముంబైకి చెందిన వినయ్ దూబే  అనే వ్యక్తి రోడ్ల మీదికి వచ్చి... ప్రస్తుతం ఎన్సీపీ కాంగ్రెస్ లతో  అయినా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని వారి వారి ప్రాంతాలకు  పంపిస్తున్నారూ.

 


 ముందు ఒక వ్యక్తి రోడ్డు మీదికి రావడం అక్కడ ప్రార్థనా స్థలం దగ్గర సమావేశం కావడం. దీంతో ఆ ప్రార్థన సభకు వేలాది మంది రావడం ఆ తర్వాత లాఠీఛార్జ్.. ఇలా చాలా సంఘటనలు జరిగాయి. అయితే కరోనా స్పెషల్ కోసం నాలుగు వేలకు పైగా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ మీద కోపంతో అమాయక ప్రజలను రోడ్డు మీదకు తీసుకువచ్చి మృత్యుఒడిలోకి నెట్టడం సరైనది కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: