గతంలో స్థానిక ఎన్నికల టైంలో కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ లెటర్ రాసినట్లు వార్తలు వచ్చాయి. ఆ లెటర్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరిట లెటర్ రాయడం జరిగింది. అప్పట్లో ఆ లెటర్ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. లెటర్ ఎవరు రాశారు అన్న దాని విషయంలో నిమ్మగడ్డ కూడా ఆ టైంలో బయటకు వచ్చి ఏమీ మాట్లాడలేకపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ లెటర్ చూపించి వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీ డైరెక్షన్లోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పనిచేస్తున్నట్లు అప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లెటర్ విషయంలో తనకి అనేక అనుమానాలు ఉన్నాయని వైసిపి పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

లెటర్ పై విచారణ చేయించాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ నీ కోరడం జరిగింది. అంతేకాకుండా స్థానిక ఎన్నికల సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన సంతకానికి అదేవిధంగా కేంద్రానికి రాసిన లెటర్ లో చేసిన సంతకానికి చాలా తేడా ఉందని విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లెటర్ గురించి వస్తున్న వదంతులను ఉద్దేశించి వివరణ ఇస్తూ .. ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఆ లెటర్ తానే రాసినట్లు ఈ విషయంలో మిగతా వారికి సంబంధం లేనట్టు క్లారిటీ ఇచ్చారు.

 

రాష్ట్రానికి మరియు కేంద్ర హోంశాఖ కి మధ్య ఎటువంటి కాంట్రవర్షియల్ లేకుండా ఈ విధంగా వ్యవహరించినట్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలిపారు. మరి ఈ విషయం ఆ లెటర్ బయట పడినప్పుడు ఎందుకు చెప్పలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ టైములో ఆ లెటర్ అసలు టీడీపీ చేతిలోకి ఎలా వెళ్ళిందో క్లారిటీ ఇవ్వలేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముప్పుతిప్పలు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: