ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యంలో రోజురోజుకు ప్రజల పరిస్థితి దారుణంగా పారిపోతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్  డౌన్ విధించిన నేపథ్యంలో... అటు ఉపాధి కరువై ఇటు చేతిలో డబ్బులు లేక దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రజలు. అయితే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పేదలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత నగదు సాయం చేయడంతో పాటు నిత్యావసర సరుకులను కూడా ఎక్కువ మొత్తంలో అందజేస్తున్నాయి. దీంతో పేద ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సహాయంతో కాస్త చేయూత దొరికినట్లయింది. 

 

 కాని ప్రస్తుతం ఉన్న సమస్యల మధ్య తరగతి వారికే . అటు సంపన్న వర్గం  కాకుండా ఇటు నిరుపేదలు కాకుండా ఉన్న మధ్యతరగతి కుటుంబాలను ఏ పార్టీలో పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అన్ని పార్టీలు ఇస్తున్న సహాయం చేయుత  కేవలం నిరుపేదలకు మాత్రమే చెందే విధంగా ఉన్నాయి. మధ్యతరగతి వాళ్లకు మాత్రం ఏది వర్తించదు . ఈ నేపథ్యంలో ఈ మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటున్నారు విశ్లేషకులు. లాక్ డౌన్  లాంటి సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు చేయూత  ఇచ్చినట్లుగానే మధ్యతరగతి ప్రజలకు కూడా ఆదుకోవాలని కోరుతున్నారు. 


 ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన విధంగా భారత్లో కూడా చేయాలని అంటున్నారు. ఇంతకీ  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు అంటారు... మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా టాక్స్ పే చేస్తూ ఉంటాయి అన్న విషయం
 ఈ క్రమంలోనే కరోనా కట్టడికి అమెరికాలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో... ఇప్పటివరకు టాక్స్ పే చేసిన మధ్యతరగతి కుటుంబాలకు కొంత మొత్తం సహాయాన్ని అందించేందుకు ట్రంప్  అమెరికాలో నిర్వహించారు. తద్వారా నిరుపేదల తో పాటు మధ్యతరగతి వాళ్లకి కూడా చేయూతనిచ్చేందుకు నిర్ణయించారు. ఇక ఇక్కడ భారత్లో కూడా ఇలాంటి విధానం పాటిస్తే  బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: