ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు దేశం మొత్తాన్ని నిర్బంధంలోకి తీసుకుంటున్నాయి. ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలంటూ సూచిస్తున్నారూ. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ప్రజాస్వామ్య దేశాలలో మాత్రం దేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు మాత్రం సరిగ్గా పాటించడం లేదు. భారతదేశం విషయానికి వస్తే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని చెబుతున్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే అటు ప్రజాస్వామ్య దేశమయిన అమెరికాలో కూడా ఇదే జరుగుతుంది. 

 


 ట్రంపు పార్టీకి ప్రతిపక్ష పార్టీలైన మిగతా పార్టీలు తమ ఆదేశాలను బేఖాతరు చేయడమే కాదు... ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడు ఆదేశాలపై  తిరుగుబాటుకు కాలు దువ్వుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ట్రంపు పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలు ట్రంప్ పై  ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ తిరుగుబాటు పార్టీలు చేస్తున్న విమర్శలపై విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కరోనా వైరస్ వ్యాప్తి ఉన్న దేశంగా అమెరికా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ కేసుల సంఖ్య అమెరికాలో లక్ష దాటిపోయింది. 

 

 ఈ నేపథ్యంలోనే కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్  విధించలేదని మొన్నటి వరకూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై విమర్శలు చేసిన  ప్రతిపక్ష పార్టీలు. కానీ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశంలో లాక్ డౌన్ విధిస్తే.. ట్రంపు విధించిన లాక్ డౌన్ తమ రాష్ట్రంలో  మాత్రం పాటించమని ఎత్తివేస్తామని అంటూ  చెబుతుండడంపై దారుణం  అంటున్నారు విశ్లేషకులు. రాజకీయ విమర్శలు చేసుకోవడం బాగానే ఉంది కానీ ఇలా లాక్ డౌన్  ఎత్తివేస్తామని ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించడం మాత్రం దారుణమన్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: