కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఒక కొలిక్కి వస్తున్నట్లు కన్పిస్తున్నాయి . రాష్ట్రం లో కరోనా  శరవేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెల్సిందే . అయితే  తెలంగాణ లో    బుధవారం కేవలం ఆరు కేసులే నమోదు కావడం విశేషం . కరోనా కేసులు నమోదు కంటే ,  ఎక్కువ సంఖ్య లో రోగులు కోలుకోవడం తో , ప్రజలు  ఊపిరి పీల్చుకున్నారు  .  గతం లో కరోనా వ్యాధి బారినపడిన ఎనిమిది మంది, బుధవారం  ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు .

 

తెలంగాణ లో విదేశాల నుంచి వచ్చిన వారు , ఢిల్లీ లోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు లో జరిగిన మతసమ్మేళనం లో పాల్గొని వచ్చిన వారి వల్లే  కేసుల విస్తృతి పెరిగింది . కరోనా కట్టడికి రాష్ట్రం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ,   మంగళవారం ఏకంగా 58 మంది ఈ వ్యాధి  బారినపడడం తో ప్రజలు బెంబేలెత్తిపోయారు . గత రెండు రోజులుగా పెద్ద సంఖ్య లో కరోనా కేసులు నమోదు కాగా , బుధవారం మాత్రం ...  కేవలం ఆరు కేసులు నమోదు కావడం తో ప్రభుత్వ వర్గాలు , ప్రజలు కాసింత ఉపశమనం చెందినట్లు కన్పించారు .  కరోనా కట్టడి చేసేందుకు రాష్ట్రం లో హాట్ స్పాట్ జిల్లాలను జాబితాను ప్రభుత్వం ప్రకటించింది  .

 

 గతం లో కరోనా కేసులు ఎక్కువ  నమోదు అయిన ,హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి , మేడ్చల్ , మెదక్ , కరీంనగర్ , నిర్మల్ , జోగులాంబ గద్వాల్ , ఖమ్మం , కొత్తగూడెం , నిజామాబాద్ , వరంగల్ జిల్లాలను హాట్ స్పాట్ కేంద్రాలుగా గుర్తించింది .    హాట్ స్పాట్ జిల్లాల్లో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టనుంది  . నాన్  హాట్ స్పాట్ జిల్లాల్లో ఈ నెల 20 వ తేదీ వరకు  పరిస్థితి పరిశీలించి , ఆంక్షలతో లాక్ డౌన్ సడలించే అవకాశముండగా  , హాట్ స్పాట్ జిల్లాల్లో మాత్రం ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగించనున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: