ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాలు చేసే కుట్రలు మామూలుగా ఉండవు.. ఇదంతా  ఆధిపత్యం కోసం చేసే విధ్వంసం.. ఉదాహరణకు పాకిస్దాన్.. ఇండియాకు ఉన్న శత్రుత్వం చూస్తే అర్ధం అవుతుంది.. ఇకపోతే జాన్ పెర్కిన్స్ అనే పేరును కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదనుకుంటా.. ఎందుకంటే ఆయా దేశాలు అప్పులు తీసుకోవడానికి కొందరు ఉద్యోగులను నియమిస్తుంది. వారి పేరే ఎకనమిక్ హిట్ మెన్. అలాంటి ఒకానొక హిట్ మానే మన జాన్ పెర్కిన్స్. తాను ఏయే దేశాలు ఎలా వెళ్లిందీ, ఎలా వారిని అప్పుల ఊబిలో ముంచిందీ వివరించి చెప్పే పుస్తకం పేరు “కన్ఫెషన్స్ ఆఫ్ ఏన్ ఎకనమిక్ హిట్ మాన్”. కాగా ఈ పుస్తకాన్ని రాసిన అమెరికన్ జాతీయుడి పేరు జాన్ పెర్కిన్స్. దీనినే తెలుగులో “ఒక దళారీ పశ్చాత్తాపం” పేరుతో అనువదించారు..

 

 

దీనిలో అమెరికా చేసిన దారుణాలన్ని ఈ రచయిత విపులంగా వివరించారు.. ఇకపోతే ఒకప్పుడు రాజ్యాలు దురాక్రమణ చేసుకోవడానికి గజ బలం, రథ బలం, అశ్వ బలం, సైనిక బలాలు ఉపయోగించేవారు నాటి కాలం రాజులు... తరువాత పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు మందుగుండు సామగ్రి కనిపెట్టి సులువుగా దాడులుచేసి, ఇతర దేశాలను అన్ని విధాలుగా దోచుకునేవి. ఆ తరువాత దాదాపు అన్ని దేశాలు తమ అమ్ములపొదిలో అణుబాంబులు నిల్వ వుంచుకున్నాక యుద్ధాలకు వెనుకంజ వేస్తున్నాయి. ఇలాంటి పరిస్దితిలో దోపిడీకి వేరే మార్గాలు అన్వేషించవలసి వచ్చింది. అలా కొత్తగా కనిపెట్టిన ఆ ఆయుధం పేరు అప్పు.

 

 

ఇది ఎలా సాగుతుందంటే ఏదైనా ఒక సహజ వనరులు విస్తారంగా వున్న దేశాన్ని ఎంపిక చేసుకోవడం.. ఆ దేశానికి అప్పులు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వడం.. ఆ దేశం ఆ అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వున్నప్పుడు ఆ దేశపు ఆర్ధిక వనరులను పీల్చి పిప్పి చేయడం.. ఇదంతా అమెరికా నూతన పన్నాగం. ఇందులో భాగంగా ఆ దేశపు ఆర్థిక రంగం బాగా ఎదుగుతుందని అందరినీ నమ్మించడానికి దొంగ లెక్కలు, గణాంకాలు కట్టివ్వడం. ఇందుకు దేశాధినేతలు ఒప్పుకుంటే సరి. లేదంటే వారిని డబ్బుతోనో, మద్యంతోనో, మగువతోనో కొనేయడం కూడా వారి వృత్తిలో భాగమే. అలా కూడా కుదరకపోతే వారు వెనక్కు వెళ్లిపోతారు. అప్పుడు అమెరికా గూఢచారి దళం సీఐఏ రంగప్రవేశం చేసి.. ఆ దేశాధినేతను హత్య చేస్తుంది. తరువాత తమకు అనుకూలంగా ఉన్నవారిని అందలాలెక్కించి, అప్పు కుమ్మరిస్తారు.

 

 

ఒకవేళ హత్య చేయడం కూడా కుదరకపోతే ఆయా దేశాల్లో అల్లర్లు చెలరేగుతాయి. అంత ర్యుద్ధాలు సంభవిస్తాయి. ఇవేవీ కట్టుకథలు కావని. నిజాలు, నగ్న సత్యాలు అని రచయిత వెల్లడించారు.. వాటికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా చితికిపోయిన ఆయా దేశాల గురించి కూడా  జాన్ పెర్కిన్స్ స్వయంగా చెప్పాడు.. ఇతను అప్పుల ఊబిలో ముంచిన ఈక్వెడార్, పనామా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, వెనెజులా, వంటి దేశాల చరిత్రలను ఈ పుస్తకంలో వివరంగా మనం చదవొచ్చు. ఈ ఎకనమిక్ హిట్ మేన్ చేయవలసింది రెండే రెండు పనులు. అందులో మొదటిది భారీ విదేశీ రుణాల గురించి దేశాధ్యక్షులను ఒప్పించడం, రెండోది ఈ అప్పులు తీసుకునే దేశాలను క్రమంగా అప్పుల ఊబిలో కూరుకు పోయేటట్టు చేసి వారిని అమెరికాకు, అప్పులిచ్చిన సంస్థలకు బానిసలుగా మార్చుకోవడం. చూసారుగా నీతులు చెప్పే దేశం చేసే పనులు.. ఇదంతా “ఒక దళారీ పశ్చాత్తాపం” హెట్ అనే పుస్తకాన్ని చదివితే పూర్తిగా అర్ధం అవుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: