కరోనా వైరస్ వ్యవహారంలో చైనాను అమెరికా మొదటి నుంచి తప్పుబడుతూనే ఉంది. ఆ దేశ అధ్యక్షుడు ఏకంగా కరోనాను చైనీస్ వైరస్ అని పలుసార్లు వెటకారంగా అన్నారంటే.. అమెరికా చైనా పట్ల ఎంత కోపంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు.. చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థతో కుమ్మక్కై కరోనా విషయాన్ని దాచి పెట్టిందని.. ప్రపంచాన్ని సరైన సమయంలో సరిగ్గా హెచ్చరించలేదని అమెరికా మండిపడుతోంది.

 

 

మొన్నటి మొన్న.. అమెరికా ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOకు నిధులు కూడా నిలిపేసింది. ఇప్పుడు ఈ అమెరికా చైనా వివాదం మరింతగా ముదురుతోంది. WHOనిధులు ఆపేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా మరోసారి చైనా పై విరుచుకుపడింది. నిన్న మొన్నటి వరకూ ట్రంప్ ఒక్కరే చైనాపై మాటల దాడి చేయగా ఇప్పుడు అమెరికన్ మంత్రులూ తమ అధ్యక్షుడి బాటలోనే వెళ్తున్నారు. అమెరికా మంత్రి మైక్ పాపియో... కొవిడ్-19ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కువ సమయం తీసుకుందని ఆరోపించారు.

 

మైక్ పాపియో మరికొన్ని కొత్త ఆరోపణలు కూడా చేశారు. కరోనా పై సరైన సమయంలో, అవసరమైనప్పుడు చైనీస్ కమ్యూనిస్టు పార్టీ అమెరికాకు అనుమతి ఇవ్వలేదని అమెరికా మంత్రి మైక్ పాపియో ఆరోపించారు. వుహాన్ కు సంబంధించి ఇప్పటికీ అమెరికాకు తెలియని సమాచారం ఎంతో ఉందని అమెరికా మంత్రి మైక్ పాపియో అన్నారు. అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ పతనమైందని పాంపియో మండిపడ్డారు.

 

అమెరికన్ల ఆరోగ్యానికి, జీవన శైలికి చైనా ఎనలేని ముప్పు తీసుకొచ్చిందని . ప్రపంచానికి తప్పుడు సమాచారం చెప్పిందని ఆయన మండిపడ్డారు. కరోనా వంటి మహమ్మారులు మళ్లీ రాకుండా జాగ్రత్త పడాలి. అన్ని దేశాలను అప్రమత్తం చేయాల్సిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ పని చేయలేదని మైక్ పాంపియో కామెంట్ చేశారు. అమెరికా ప్రజలు కట్టిన పన్ను డబ్బును ఒక్క డాలర్ కూడా ఇవ్వబోమన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: