క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ ప్ర‌పంచ‌దేశాలకు ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. ప్ర‌స్తుతం ప్రపంచ‌వ్యాప్తంగా 20 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. వాటిలో సగం యూరప్ నుంచే ఉండడం గమనార్హం. మ‌రియు మ‌ర‌ణాల సంఖ్య 1 ల‌క్ష 30 వేల‌కు పైగా దాటిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు క‌రోనాను నియంత్రించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

 

అయితే ప్ర‌స్తుతం కరోనా నిర్దారణ పరీక్షలు అంత సులువుగా సాగేది కాదు. కాని ఇలాంటి విప‌త్స‌ర ప‌రిస్థితుల్లో విమానయాన సంస్థ ఎమిరేట్స్ ఒక ముంద‌డుగు వేసి.. దుబాయ్‌ నుంచి వెళ్లే ప్రయాణికుల కోసం ఆన్‌సైట్‌ రాపిడ్‌ కొవిడ్‌-19 పరీక్షను అందుబాటులోకి తెచ్చింది. అది కూడా ఇకపై విమానాలు ఎక్కే ప్రయాణికులకు కరోనా లేదని తేల్చేందుకు కేవలం 10 నిమిషాల్లో పరీక్ష నిర్వహించే విధానాన్ని దుబాయ్ అమలులోకి తెచ్చింది. ఆన్‌ సైట్‌ రాపిడ్‌ కొవిడ్‌-19 పేరిట పిలిచే ఈ టెస్ట్ లో ఫలితం 10 నిమిషాల్లో వచ్చేస్తుంది.

 

విమానయాన పరిశ్రమలోనే తొలిసారిగా ఎమిరేట్స్‌ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి విశేషం. చెకిన్‌ ఏరియాలో దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఇక రాపిడ్ కొవిడ్-19 టెస్టింగ్ స‌క్సెస్ ఫుల్‌గా అమలవుతోందని అన్నారు. కాగా, భారత ఎయిర్ పోర్టులు, ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా ఈ విధానాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఈ విధానంలో ఫలితాల ఖ‌చ్ఛితత్వాన్ని పరిశీలించిన త‌ర్వాత‌.. ఇదే విధానాన్ని ఇండియాలోనూ అమలు చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: