బాహుబలి... ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచం మొత్తం మీద ఈ సినిమాథియేటర్ లో ఆడిందో మీకు బాగా తెలుసు. బాహుబలి 2 పార్ట్స్ విడుదలై ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లని కొల్లగొట్టింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సినిమా నిర్మాత యార్లగడ్డ శోభు గురించి. ఆయన మరెవరో కాదు దర్శకుడు రాఘవేంద్ర రావు అల్లుడు. అంతే కాదు ఆరు భాషల్లో టీవీ ప్రోగ్రామ్స్ చేస్తున్నా ఆర్కా మీడియా సంస్థ అధినేత.

 


ప్రస్తుతం కరోనా వైరస్ కి ప్రతి ఒక్కరు వారు సహాయంగా ఎంతోకొంత సహాయం చేస్తూ వస్తున్నారు. అయితే అందరూ చేయాల్సిన అవసరం లేదని తెలుసు... కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి సినిమా రంగంలో చాలామంది వారి పొట్ట కూటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. దీని కోసం అనేక మంది అనేక విధాలుగా వారికి సహాయం చేస్తూ ఉన్నారు. కానీ కొందరు ఇది ఏమి మాకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిజానికి వందల కోట్లు లాభాలను ఆర్జించిన వారు మాత్రం అది కూడా సహాయం చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. వారికి సమాజం ఈ స్థాయిలో లాభాలు అర్జీలు ఇచ్చిన వారు తిరిగి మళ్లీ సమాజానికి ఏమి అని వెతికి చూస్తే కూడా ఏమీ కనిపించడం లేదు. మరి ఇలాంటి కొన్ని కుటుంబాలు ఏం చేస్తున్నా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.

 


అయితే ఇక అసలు విషయానికి వస్తే సర్వ గోష్ అనే వ్యక్తి ఎవరో కానీ సురభి డ్రామా ఆర్టిస్టుల బాగు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 128 ఏళ్ల ఘనచరిత్ర ఉన్న సురభి కళాకారుల వారి గురించి చెబుతూ నాటకం అంటే సురభి. సురభి అంటే నాటకం అని తెలియ పరుస్తూ... ప్రస్తుతం ఇరు కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. మరింత దిగజారింది అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అందులో మీకు చేతనైతే ఇవిగో బ్యాంకు ఖాతాలో అని తెలియ పరుస్తూ పూర్తి విశేషాలను అందులో పొందుపరిచారు.

 


అయితే ఇక్కడే వచ్చింది ఏమంటే యార్లగడ్డ శోభు ఏం చేశాడని చూస్తే... ఈయన ఈ పోస్ట్ ను చూసి కదిలిపోయాడు అలాగే స్పందించాడు తనలోని మనిషి నిద్రలేచాడు. కాకపోతే ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు అండోయ్. కేవలం ఆ పోస్టర్ రిపోస్ట్ చేశాడు. అంటే ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే చేయండి అని చెబుతున్నారు ఆయన. ఇది ఎలా ఉందంటే నేను చేసే సహాయం ఇదే అన్నట్లుగా ఉంది. రీ పోస్ట్ చేయడం కూడా సాయమైనా ఇదేనా చేయగలిగింది అంటూ కొంతమంది కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: