క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఈ మ‌హ‌మ్మారిపై అనేక వ‌దంతులు అంత‌కంటే ఎక్కువ వేగంతో వ్యాప్తి చెందుతున్నాయి. అస‌లు క‌రోనా వైరస్ ఎందుకు వ‌స్తుంది..ఎలా వ‌స్తుంది...దాన్ని మ‌న ద‌రిచేర‌కుండా ఉండేందుకు మ‌నం ఏం చేయాలి..ఎలాంటి  ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే అంశాల‌పై హెరాల్డ్ పాఠ‌కులకు  అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం.. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ఒక రూమ‌ర్ బాగా స్ప్రెడ్ అవుతోంది. అదేటంటే... రేడియో త‌రంగాల ద్వారా క‌రోనా వ‌స్తుంద‌ని. ఒక విష‌యం అంద‌రూ తెలుసుకోవాలి. రేడియో తరంగాలు / మొబైల్ నెట్‌వర్క్‌లలో వైరస్లు ప్రయాణించలేవ‌ని. 

 

నిజమేంటంటే COVID-19 సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ము లేదా మాట్లాడేటప్పుడు శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. అయితే వ్యాధి సోకిన వ్య‌క్తి తాకిన వ‌స్తువుల‌ను తాకి మ‌న క‌ళ్లు, నోరు లేదా ముక్కును తాకడం ద్వారానే క‌రోనా వైర‌స్ బారిన ప‌డే ప్ర‌మాద‌ముంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక  మ‌రో వ‌దంతి ఏంటంటే ఎండ‌లో ఉంటే క‌రోనా వైర‌స్ సోక‌ద‌ని...ఇందులో ఎంత‌మాత్ర నిజంలేదు.ఎండ‌లో లేదా  25  డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో మీరు ఉన్నా కరోనావైరస్ మిమ్మ‌ల్ని అటాక్ చేయ‌డానికి ఆస్కారం ఉంది.  వేడి వాతావరణం ఉన్న దేశాల్లో కూడా  COVID-19 కేసులు న‌మోద‌వుతుండటం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని గ్ర‌హించండి.  

 

మీ  క‌ళ్ల‌ను, నోరును, ముక్కును, కాళ్లు చేతుల‌ను తరచుగా శుభ్రపరుచుకోవ‌డం ద్వారా , మరియు ముక్కును తాకకుండా ఉండండ మే ర‌క్షిస్తాయ‌ని గ్ర‌హించండి.  దోమల ద్వారా క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతుందని సూచించడానికి ఈ రోజు వరకు కూడా ఎటువంటి నిరూప‌ణ‌లు జ‌ర‌గ‌లేదు. కాబ‌ట్టి ఇందులో వాస్త‌వం ఉంటుంద‌ని భావిచ‌కండి.  కొత్త కరోనావైరస్ అనేది శ్వాసకోశ వైరస్, ఇది ప్రధానంగా సోకిన వ్యక్తి దగ్గుతున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు లేదా ముక్కు నుండి లాలాజలం లేదా తుంప‌ర‌ల ద్వారా మాత్ర‌మే వ్యాపిస్తుంద‌ని నిరూప‌ణ జ‌రిగింది.  అయితే మ‌ద్యం అలవాటున్న కొద్దికాలం మానుకోండి. పొగ‌తాగేవారిని కోవిడ్ -19 తొంద‌ర‌గా ప్ర‌భావితం చేస్తుంద‌ని గ్ర‌హించండి. అపోహాల‌కు దూరంగా...మీకు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే భ‌య‌ప‌డ‌కుండా వెంట‌నే ఆస్ప‌త్రుల‌కు వెళ్లి ప‌రీక్ష‌లు చేయించుకోండి. జాగ్ర‌త్త‌లు పాటిస్తే క‌రోనా జ‌యించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదన్న విష‌యాన్ని తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: