అర్ధం చేసుకునే వారికి చిన్న మాట చెప్పినా ఆచరించి చూపుతారు.. అసలు బుర్రలేని వారి చెవిలో ఒకే పాటను పదే పదే పాడిన వారి మంద బుద్ధి దాన్ని గ్రహించదు.. ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో ఇదే జరిగింది.. ఈ వైరస్ బారిన పడకుండా దాక్కోండి.. ఇంట్లోనే ఉండండని అధికారులు, ప్రభుత్వాలు చెబుతున్నా గాని కొందరు పట్టించుకోవడం లేదు.. మరికొందరు అతి తెలివిపరులు కరోనాను అంటించుకుని దాక్కుంటున్నారు.. ఇలాంటి వారి తెలివికి నవ్వాలో, ఏడ్వాలో అర్ధం కాదు.. మరీ ఇంట్లో ధనం ఉంటే దాచుకోవాలి గాని కరోనా వైరస్ ఉంటే దాచుకోవడం ఏంటి.. దిక్కుమాలిన చర్య.. ఇలా దాచుకుంటే దాగడానికి అవేమి డబ్బులు కావు.. రోగం.. ఇలా దాచుకున్న ఓ కుటుంబం తమతో పాటు తమ కుంటుబంలోని వారికి, ఇంటి చుట్టుపక్కల వారికి ఈ వైరస్ అంటించి వారిని చిక్కుల్లో పడవేసింది..

 

 

గుంటూరు జిల్లాలోని, వెంగళాయపాలెంలో జరిగిన ఈ ఘటన అక్కడ కలకలం సృష్టించింది... ఈ కరోనా విషయంలో ఒకే ఇంట్లో ఉంటున్న ఐదుగుర్ని పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు. ఆ వివరాలు చూస్తే.. గుంటూరుకు చెందిన ఓ వృద్ధుడు కరోనాతో చనిపోయాడు. కాగా ముందస్తు చర్యగా జాగ్రత్తగా అతడి కుమారుడ్ని క్వారంటైన్‌కు తరలించగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇతనికి కరోనా పాజిటివ్ రావడంతో, అనుమానం కలిగిన పోలీసులు అతడి భార్య ఏమైందని ఆరా తీయగా, ఆ వృద్ధుడి కుమారుడు తన భార్యను వెంగళాయపాలెంలోని బంధువుల ఇంటికి పంపించినట్లు తేలింది.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను కూడా క్వారంటైన్‌కు తరలించి శాంపిల్స్ పరీక్షించగా.. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అధికారులు, పోలీసులు ఆమెతో పాటుగా కలిసి ఉన్న మరో ఐదుగుర్ని క్వారంటైన్‌కు తరలించారు.

 

 

అలాగే ఆ పక్క ఇళ్లలో ఉన్న వారిని కూడా క్వారంటైన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు.. చూశారుగా ఇలాంటి తెలివితక్కువ పనులు చేసి మీ కుంటుంబ సభ్యులకు, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి కరోనాను అంటించకండి.. ఈ వైరస్ లక్షణాలు కనబడితే దయచేసి అందరికి దూరంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వైద్యపరీక్షలు చేపించుకోండి.. మనం పన్నులు సరిగా కడితేనే దేశం ముందుకు వెళ్లదు.. ఇలాంటి విషయాల్లో బాధ్యతగా ప్రవర్తిస్తే కూడా మన దేశాన్ని కాపాడిన వారం అవుతాం.. లేదంటే ఈ కరోనా మనదేశంలో ఎన్ని రోజులుంటే అంతకాలం నష్టపోయేది మనదేశమే కాదు.. మనం కూడా.. ప్లీజ్ ఆలోచించి బాధ్యతగా మసలుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: