ప్రపంచంలో ఇప్పుడు కరోనా మహమ్మారి ఎలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే రోజు పెరిగిపోతున్న మరణాల సంఖ్య.. కేసుల సంఖ్య చూస్తుంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థం అవుతుంది.  అయితే కరోనా చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే.  ఇక్కడ ఆలస్యంగా వెలుగు లోకి రావడంతో అప్పటికే ఇక్కడ నుంచి చాలా మంది విదేశీయులు, టూరిస్టులు  తమ స్వస్థలాలకు చేరుకోవడంలో వైరస్ వ్యాప్తి అన్ని దేశాలకు పాకింది.  తమ వల్లే ప్రపంచమంతా ఆ రోగం విస్తరించిందనే అప్రతిష్టను మూటగట్టుకున్న చైనీయులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

 

 

అక్కడ కరోనా తగ్గుముఖం పట్టిందని అంటున్నారు.  దాంతో అక్కడ కరోనా జాడ కనిపిస్తే చాలు ‘వేసెయ్ ఆస్పత్రిలో’ అంటున్నారు.  అయితే ఇది చాలదన్నట్లు ఇప్పుడు చైనా వాసులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయంటున్నారు. రష్యా నుంచి అక్రమంగా చొరబడతున్న చైనీయుల వారి ద్వారా ఆ వ్యాధి పెరగడంతో చైనా ప్రభుత్వం కలవరపెడుతోంది. కరోనా వల్ల విమానాలను రద్దు చేయడంతో విదేశాల్లో చిక్కుకుపోయిన చైనీలు అక్రమంగా సొంత దేశానికి వచ్చేస్తున్నారు.

 

దీంతో అక్కడ 79 కేసులు నమోదయ్యారు. వలసలే దీనికి కారణమని భావించిన చైనా అధికారులు కొత్తగా వచ్చిన వారిని వేటాడుతున్నారు.  ఈ నేపథ్యంలో అలాంటి అక్రమదారులు ఎవరైనా కనిపిస్తే.. ఆచూకీ చెబితే వారికి రూ. రూ. 54 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ముఖ్యంగా సరిహద్దులోని సూయిఫెన్హేలో కొత్తముఖాలు పెద్దసంఖ్యలో కనిపిస్తుండడతో తనిఖీలను ముమ్మరం చేశారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: