తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్ర‌బాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ర్ట జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న కోవిడ్ -19 విష‌యంలో రాష్ర్టానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ర్టంలో మొట్టమొదటి కేసు వచ్చిన దగ్గర్నుంచి ప్రతి రోజూ రివ్యూచేస్తూ ఎక్కడ ఏ విధంగా చర్యలు చేపట్టాలి.ఏ విధంగా పేదలు,రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి వారి బాగోగులు చూస్తూ కరోనాను ఎలా కట్టడి చేయాలా అని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.

 

మంత్రుల సబ్ కమిటి, జిల్లాలోమంత్రులు,నియోజకవర్గస్దాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసి కరోనా నియంత్రణకు పోలీసు, శానిటరీ, రెవిన్యూ, వైద్య ఆరోగ్య సిబ్బంది అంతా డే అండ్ నైట్ కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారని మంత్రి అనిల్ తెలిపారు. ``ఒక జాతీయన్యూస్ ఛానల్ భారతదేశంలోనే  మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టేట్ ఇన్ లాక్ డౌన్ అనే ఉదాహ‌ర‌ణ తీసుకోవాలంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని పేర్కొంది. లాక్ డౌన్లో కేసులు తగ్గించడంలోగాని, జాగ్రత్తలు తీసుకోవడంలోగాని మొట్టమొదటిస్ధానం ఏపికి వచ్చిందంటే ఈ రాష్ర్ట ముఖ్యమంత్రి ముందుచూపే కారణం. `` అని మంత్రి అనిల్ పేర్కొన్నారు.

 

 

చంద్రబాబునాయుడు లాగా రోజూ వచ్చి అబద్ధాలు చెప్పడం, హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టడం, దానిని ఒక ఈవెంట్ గా చేసుకునే మనస్తత్వం సీఎం జగన్‌కు లెేదని  మంత్రి అనిల్ స్ప‌ష్టం చేశారు. ``తన పని తాను చేసుకుంటూ పని మాట్లాడాలి...పబ్లిసిటి కాదు అనే విధంగా మా ముఖ్యమంత్రి జ‌గ‌న్ ముందుకు వెళ్తుంటారు. అదే విధంగా పనులు జరుగుతున్నాయి. రాష్ర్టం అంతా కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉంటే ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం తన పంథా వీడటం లేదు. ఆయన ఈ రాష్ర్టంలో లేడు, పక్క రాష్ర్టంలో ఉన్నాడు. ముసలివాళ్లు,చిన్నపిల్లలకు జాగ్రత్తలు తీసుకోమంటున్నాం. చంద్రబాబునాయుడు వయస్సు పైబడింది కాబట్టి ఆయనను తిరగమని కాని, లేకపోతే ప్రజలకు దగ్గర ఉండాలని ఎవరూ కోరుకోరు. ప్రభుత్వం కూడా ఆయనను హౌస్ ఐసోలేషన్ లో జాగ్రత్తగా ఉండమని చెబుతోంది. ఈరోజు చంద్ర‌బాబు రాలేదు. ఆయన కుమారుడి వయస్సు చిన్నదేగా. ఆయనైనా కనీసం ఈ రాష్ర్టంలో ఉన్నాడా అంటే ఆయన ఎలా ఎక్కడకు పోయాడో కూడా తెలియదు. కాని తప్పుడు రాజకీయాలు చేస్తూ శునకానందం పొందుతున్నారు.`` అని మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: