ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ప్రతిరోజూ రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. మరోవైపు దేశంలో కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లో కరోనా మరణ మృదంగం మ్రోగిస్తోంది. కేంద్రం దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, రవాణా సేవలను స్తంభింపజేసింది. 
 
కేంద్రం ప్రజలందరూ పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యేలా చర్యలు చేపట్టింది. కేంద్రం 21 రోజుల్లోగా కరోనాను కట్టడి చేయవచ్చని భావించి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది. లాక్ డౌన్ ప్రకటించక మునుపు దేశంలో 600 కరోనా కేసులు నమోదు కాగా ఏప్రిల్ 14వ తేదీ నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 11,000కు చేరింది. తబ్లీగీ జమాత్ వల్ల దేశంలో భారీగా కేసులు నమోదయ్యాయని వార్తలు వినిపించాయి.
 
ఈ కార్యక్రమానికి హాజరైన వారిని, వారి సన్నిహితులను, కుటుంబ సభ్యులను మార్చి ఏప్రిల్ నెల మొదటివారంలోనే గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. తబ్లీగీ జమాత్ కేసులు వెలుగులోకి వచ్చి 14 రోజులైనా కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గలేదు. కేసుల సంఖ్య తగ్గకపోవడానికి ప్రధాన కారణాలు తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు గుర్తించే లోపే కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. 
 
 అధికారులు కరోనా అనుమానితులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించినా వారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రమే పరీక్షలు జరుపుతున్నారు. ఏపీలో కొంతమందికి నోట్ల ద్వారా కరోనా వ్యాపించిందని ప్రచారం జరుగుతోంది. అధికారులు నోట్ల ద్వారా కరోనా వ్యాప్తిని ఖండించినా కొందరు ఇప్పటికీ కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని విశ్వసిస్తున్నారు. పానీపూరి వ్యాపారులు, టిఫిన్ బండి వ్యాపారులు, పిజ్జా డెలివరీ బాయ్, చికెన్ వ్యాపారులు... ఇలా వివిధ పనులు చేసేవారిలో ఒక్కరికి కరోనా సోకినా వారి నుంచి వేగంగా ఇతరులకు వైరస్ వ్యాపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: