ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీల విషయంలో ప్రతిదీ వైరల్ గా మారుతుంది.  ఈ నేపథ్యంలో కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతారని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర విమర్శలు గుప్పించారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన రాయపాటి తాను సీఎం జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.   కమ్మవారిపై ద్వేషం మంచిది కాదంటూ జగన్ కు తాను సలహా ఇచ్చానని... అన్ని కులాలను కలుపుకుని వెళ్లాలని చెప్పానని తెలిపారు. 

 

తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని చెప్పారు.  జగన్ పై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి తనకు మంచి సన్నిహితుడని చెప్పారు.  అయితే మొదటి నుంచి తాను ఫ్యాక్షన్ రాజకీయాలకు చాలా దూరం అని.. ఇలాంటి వార్తలు పుట్టించడం బాధాకరంగా ఉందని అన్నారు.  అంతే కాదు రాత్రి నుంచి తనకు నకు వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. 

 

సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారని అన్నారు. ప్రజలు కోరుకునేది మంచి పరిపాలన.. అది ఎవరు అందించినా తాను వారికి సంపూర్ణ మద్దతు ఇస్తానని అన్నారు.  ప్రస్తుతం ఏపిలో కరోనా తీవ్రత చాలా ఉందని.. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నియమాలు తప్పకుండా పాటించాలని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: