మహారాష్ట్రలోని పూణే, ముంబై నగరాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దాంతో పూణే నగర పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్ల మీదకి వచ్చే వారికి వింత శిక్షలను విధిస్తున్నారు. తాజాగా అటువంటి వింత శిక్షకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతుంది. 

 


పూర్తి వివరాలు తెలుసుకుంటే... ఈరోజు అనగా ఫిబ్రవరి 16వ తేదీన పూణేలోని బిబ్వేవాడి ప్రాంతంలో నివసించే ప్రజలు మార్నింగ్ వాక్ చేసేందుకు రోడ్ల మీదకి తండోపతండాలుగా తరలివచ్చారు. అయితే ఆ సమయంలోనే పోలీస్ కంట్రోల్ రూమ్ వ్యాన్ లో పెట్రోలింగ్ చేస్తున్న అధికారులు వెంటనే జనసంద్రాన్ని ఆపి రోడ్లమీద ఎందుకు వచ్చారో ఆరా తీయగా... మార్నింగ్ వాక్ చేసేందుకు వచ్చాము సార్ అని చెబుతూ పెద్ద ఝలక్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన పోలీసులు... వారందరి చేత సూర్య నమస్కారాలు, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయించడంతో పాటు జంపింగ్స్ కూడా చేయించారు. మార్నింగ్ వాక్ చేసేందుకు వచ్చిన వారిలో ఆడవాళ్లు కూడా ఉండటం గమనార్హం. అయితే లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఈ శిక్ష ను అనుభవిస్తున్న ప్రజల యొక్క దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. 

 

 


ఇకపోతే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్ల మీదకు వస్తున్న ప్రజలకు పోలీసులు రక రకాల శిక్షలను విధిస్తున్నారు. గుంజీలు తీయించడం నుండి ఐదు వందల సార్లు క్షమించండి అని రాయించే కొత్త కొత్త శిక్షలను పోలీసులు విధించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు యమ రాజు వేషాన్ని వేసి రోడ్ల మీదకు వస్తున్న ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించి అందరి ప్రశంసలు అందుకున్న సంగతి విదితమే. చండీగర్ రాష్ట్రంలో ఓ ఉన్నతస్థాయి పోలీస్ అధికారి వీఐపీ లాగా పిలవబడే కొంతమంది లాక్ డౌన్ నిబంధనలు ఇష్టారాజ్యంగా ఉల్లంఘిస్తూ రోడ్ల పైకి వస్తుంటే... ఇంకోక్కసారి ఇదే గనుక పునరావృతమైతే మీ పరువు రోడ్లమీదకి ఈడుస్తానంటూ వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి అందరి మన్నలను పొందారు. ఏది ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పోలీసులు అహర్నిశలు డ్యూటీలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: