ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఎవరి ఇంటికి వారే పరిమితం అయ్యారు.  ఎక్కడో అత్యవసర పరిస్థితిలు ఉంటే బయటకు వస్తున్నారు.  కొనా కొంత మంది మాత్రం లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు.  అయితే లాక్ డౌన్ నేపథ్యంలో అంతా నిర్మాణుష్యంగా ఉండటల.. కొన్ని పక్షులు.. జంతువులు రోడ్లపై.. ఇళ్లల్లోకి రావడం జరుగుతుంది.  ఈ మద్య ఓ ఇంట్లోకి చిరుత గొడదూకి లొపలికి వచ్చి కుక్కపై అటాక్ చేసింది.  తాజాగా మధ్యప్రదేశ్ లో పెద్దపులుల ధాటికి వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు బలయ్యారు. పెంచ్ పులుల సంరక్షణ ప్రాంతంలో ఓ 18 ఏళ్ల యువతి ని పులి చంపేసింది. 

 

అయితే మృతురాలిని.. సంతోషి బాల్ చంద్ గా గుర్తించారు. ఆమె స్థానికంగా దొరికే మహువా పూలను సేకరించేందుకు తుయిపానీ అటవీప్రాంతానికి వెళ్లగా, అక్కడే పొంచి ఉన్న పెద్దపులి ఒక్కుదుటున లంఘించి మెడ పట్టుకుని చంపేసింది.  కాకపోతే ఆ యువతి మృతదేహాన్ని ఏమీ చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయిందని అంటున్నారు.  మొన్న ఓ మహిళను చంపేసిన ఓ ఆడపులిని మత్తు మందు ఇచ్చి అటవీ అధికారులు బంధించారు.

 

రెండ్రోజుల క్రితం బంధావ్ గఢ్ టైగర్ రిజర్వ్ లో ఖిటోలీ ప్రాంతంలో ఓ మహిళను ఆడపులి చంపేసింది.   దాంతో అక్కడ ప్రజలు ప్రతిరోజూ భయాందోళనకు గురిఅవుతున్నారు.  తాజాగా ఈ విషయంపై అటవీశాఖ అధికారులు స్పందిస్తూ, బఫర్ జోన్ లో ఎవరూ మహువా పూల సేకరణకు వెళ్లొద్దని హెచ్చరించారు. పూలు సేకరిస్తున్న మహిళలను పులులు జంతువులుగా భావించి చంపుతుండొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: