పడక గది సుఖం కోసం పిచ్చెక్కిపోయిన ఒక మహిళ సెక్స్ సైకోగా మారింది. సెక్స్‌ కి బానిసగా మారి చిన్నారులను లైంగికంగా హింసించడం మొదలుపెట్టింది ఆ వయ్యలాడి. అంతే కాకుండా ఆమెకు భర్త సహకారం కూడా తోడవడంతో ఇద్దరూ కలసి చిన్నారులను లైంగికంగా హింసించి ఆనందం పొందేవారు. ఒక మహిళ అయి ఉండి అమ్మాయిలతో అసజ శృంగార కలాపాలు సాగించేది ఆమె.  ముక్యంగా మైనర్ ఆడ పిల్లలను లైంగికంగా హింసించి మరీ పైశాచిక ఆనందం పొందేది ఆ కిరాతుకురాలు. 

 


ఆమె రెండు సంవత్సరాలలో మొత్తం నలుగురు చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేసింది. మైనర్  బాలబాలికలపై భర్తతో కలసి ఆమె చేసిన దారుణాలు బయటపడడంతో కోర్ట్ లో అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఆ అభియోగాలను విచారించిన న్యాయస్థానం విస్మయానికి గురైంది. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులను దారుణంగా హింసించిన ఈ ఇద్దరికీ అసలు బయట తిరిగే అవకాశం లేదని వ్యాఖ్యానించింది. వీరిద్దరూ జీవితాంతం జైలులోనే ఉండాలని తెలుపుతూ సెక్స్ సైకో దంపతులకు కఠిన శిక్షలు విధించింది కోర్ట్.

 


అయితే ఈ సంఘటన అమెరికాలో జరిగింది. అయితే చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడిన అభియోగాల కింద అమెరికాలోని ఇలినాయిస్‌ కి చెందిన ఆండ్రియా లీస్‌గాంగ్ (38) కి కోర్టు మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఏకంగా 75 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ఆమె భర్తకు జెరెమి లీస్‌ గాంగ్‌ కి 40 సంవత్సరాలు  జైలు శిక్ష పడింది. అయితే మైనర్లపై లైంగిక నేరాలకు చేసినందుకు అభియోగాల కింద భార్యాభర్తలకు మాడిసన్ కౌంటీ కోర్టు ఈ శిక్షలు వేసింది. అయితే ఇందులో ఆమెపై నమోదైన 2 అభియోగాల్లో ఒక అభియోగానికి 15 ఏళ్లు, మరో అభియోగానికి 60 ఏళ్లు శిక్ష విధిస్తున్నట్లు అటార్నీ టామ్ గిబ్బన్ శిక్ష విధించారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: