ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధిని వెతుక్కుని అక్కడ పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ పని చేయడం ఇష్టం లేక ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి ఇష్టపడు తుంటారు. ఇక ఇలా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉంటుంది. అయితే దాదాపు 30 లక్షల మంది తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి ప్రస్తుతం అక్కడ పని చేస్తున్నారు . గల్ఫ్ దేశాలలో చాలా రంగాలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ఇక భారత దేశ వ్యాప్తంగా దాదాపు 90 లక్షల వరకు గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్న భారతీయుల సంఖ్య ఉంది. 

 

 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉపాధి పొందుతున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది. అక్కడ రోజురోజుకు ఉపాధి కరువవుతుంది ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్లకు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా అన్ని దేశాలు లాక్ డౌన్  లో  వున్నాయి. ఎలాంటి దిగుమతులు ఎగుమతులు మాత్రం జరగడం లేదు. ఈ క్రమంలోనే అక్కడ అన్ని రంగాల్లో నష్టాలు ఏర్పడుతున్నాయి. దుబాయ్, కువైట్, ఒమాన్, కతర్,  బహ్రయిన్  లాంటి దేశాలకు వెళ్లి ఉపాధిని వెతుక్కుంటూన్న  వాళ్లు చాలామంది. అక్కడి ఆయిల్ బావుల దగ్గర పనిచేసే వాళ్ళు అంతే కాకుండా అక్కడి దుబాయ్ షేక్ ల దగ్గర డ్రైవర్గా పని చేసేవారు, భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు ఇలా వివిధ రంగాలలో అక్కడికి వెళ్లి ఉపాధి పొందుతున్న వారు చాలా మంది ఉన్నారు. 

 

 అయితే ప్రస్తుతం అన్ని దేశాల్లో లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఆయిల్  కొనుగోలు చేసే వారు తక్కువ అయ్యారు. అక్కడ వ్యాపారులకు వచ్చే సంపద కూడా తక్కువ అయిపోయింది. తద్వారా అక్కడ ఉపాధి పొందుతున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కరువవడంతో ప్రస్తుతం వారి జీవనం స్తంభించి పోతుంది. ఎందుకంటే ఆయిల్ బాబుని సహా పలు వ్యాపారంలో వచ్చిన లాభాలతో ఇల్లు కట్టుకోవడం లేదా పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం అక్కడ పూర్తి నష్టాల్లో కూరుకుపోతున్న తరుణంలో అక్కడ ఉన్న భవన  నిర్మాణరంగ కార్మికులు అందరూ అక్కడ ఉండలేక ఇక్కడికి రా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరి వీరి  విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: