దేశంలో ప్రతిరోజు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.90 లక్షల మందికిపైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,380 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటివరకు 1489 మంది బాధితులు కోలుకోగా 414 మంది మృతి చెందినట్లు చెప్పారు. నిన్న ఒక్కరోజే 941 కరోనా నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇదిలా ఏపిలో కొన్ని జిల్లాల్లో కరోనా తీవ్రత చాలా చూపిస్తుంది. 

 

కొన్నిజిల్లాల్లో దీని ప్రభావం పరిమితంగానే ఉన్నా, గుంటూరు, కర్నూలు వంటి జిల్లాల్లో ఉద్ధృతంగా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కాస్త అదుపులో ఉన్నట్లు అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో, కడప జిల్లాలో 13 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకోవడం ఊరట కలిగించే అంశం. ఇంది మంచి  విషయం అని.. కరోనాని పూర్తిగా కోలుకున్నవారి కి మళ్లీ టెస్టులు చేయాల్సి వస్తే చేస్తామని అన్నారు.

 

 ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ హరి కిరణ్ శుభాకాంక్షలు తెలిపారు.  డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని వారి అంకితభావంతో సేవలు అందించారంటూ వైద్య సిబ్బందిని అభినందించారు. ప్రస్తుతం ఏపీలో  534 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గుంటూరు (122), కర్నూలు (113) జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదయ్యాయి.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: